Vehicle Number Astrology: మన చుట్టూ ఉన్న ప్రతిదీ మరోదాని ద్వారా ప్రభావితమవుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ ​​విషయాలు సానుకూల లేదా ప్రతికూల శక్తిని ప్రసారం చేస్తాయి. ఇనుము, నలుపు రంగు, నూనె మొదలైన వాటివి నెగిటివ్‌ను స్ప్రెడ్ చేస్తాయని చాలామంది నమ్ముతారు. జ్యోతిషశాస్త్రంలో వాహనాలు శనికి సంబంధించినవిగా చెబుతారు. ఎందుకంటే అవి ఇనుముతో చేస్తారు. అంటే పెట్రోల్-డీజిల్ ఇంధనం కోసం ఉపయోగిస్తారు. కారు, బైక్ విషయంలో ఏ తప్పులు చేస్తే శని దేవుడికి కోపం వస్తుందో తెలుసుకుందాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వస్తువులను ఉంచవద్దు


కారు, బైక్ కొనుగోలు చేసేటప్పుడు ఇతర ఫీచర్లు, సదుపాయాలు, బడ్జెట్ కాకుండా అందులో ఎంత స్టోరేజీ స్పేస్ ఉందో కూడా చూస్తారు. ఫోర్ వీలర్‌లో లకేజీ పెట్టుకునేందుకు బ్యాక్‌సైడ్ ప్లేస్ ఎక్కువగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. పెద్ద వాహనాన్ని తీసుకోవడం మంచిదే అయినా.. అందులో అనవసరమైన వస్తువులను పెడితే శని దేవుడికి కోపం తెప్పిస్తుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. దీంతో పాటు శని జాతకంలో గ్రహంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 


జ్యోతిష్యం ప్రకారం కారులో స్టెప్నీ, టూల్ కిట్ వంటి నిత్యావసర వస్తువులు ఉంచుకుంటే ఫర్వాలేదు. కానీ పాత బిల్లులు, వేస్ట్ పేపర్లు, ఇతర వస్తువులు పెట్టుకోవడం సరికాదు. ట్రంక్‌లో అనవసరమైన వస్తువులను ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. ట్రంక్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ.. నెగిటివ్ ఎనర్జీకి దూరంగా ఉండండి. 


వాహనంలో శనికి సంబంధించిన దోషం ఉంటే వాహనం మళ్లీ మళ్లీ పాడైపోవడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా జాతకంలో శని అశుభ స్థానం వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఈ చెడు ప్రభావాన్ని తగ్గించడానికి వాహనం  ట్రంక్‌ను శుభ్రం చేస్తూ ఉండండి. అలాగే మీ వాహనాన్ని సమయానికి సర్వీసింగ్‌లో ఉంచుకోండి. కారులో ఎలాంటి అనైతిక పనులు చేయవద్దు. నిబంధనలను ఉల్లంఘించవద్దు. నియమాలను ఉల్లంఘించే వ్యక్తులపై శని త్వరగా ప్రభావం చూపుతుంది.


మీకు పదే పదే కారుకి సంబంధించి ఏదైనా సమస్య వస్తే శని ఆగ్రహించినట్టే. ఇందుకోసం ప్రతి శనివారం శని దేవుడికి ఆవాల నూనెను సమర్పించండి. పేదలకు, నిస్సహాయులకు సహాయం చేయండి. శని ఆలయంలో లభించే నిమ్మకాయ, మిరపకాయలను మీ వాహనంపై రాయండి. ఇది శని సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


Also Read: Sula Vineyards IPO: మార్కెట్‌లోకి సులా వైన్స్‌యార్డ్స్.. 40 రూపాయలతో ట్రేడ్  


Also Read: Happy Birthday Rajinikanth: రజినీకాంత్ కోసం శ్రీదేవి ఏడు రోజులు ఉపవాసం.. కారణం తెలుసా..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook