Astrology: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం బృహస్పతిని దేవ గురువుగా పరిగణిస్తారు. ప్రతి యేడాది గురు గ్రహం తన రాశిని మార్చుకుంటుంది. ఇలా బృహస్పతి రాశి మార్పు కారణంగా 12 యేళ్లు పన్నెండు నదులకు పుష్కరాలు ఏర్పడుతాయి. దేవగురు బృహస్పతి ప్రస్తుతం రోహిణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. సుమారు 12 యేళ్ల తర్వాత బృహస్పతి మే 2024లో వృషభరాశిలోకి ప్రవేశించాడు. దీని తరువాత, జూన్ 2024 న, బృహస్పతి రోహిణి నక్షత్రంలోకి తిరిగి ప్రవేశించాడు. ఆగస్టు చివరి వారంలో 2024 వరకు ఈ రాశిలో సంచరించబోతున్నాడు.దీంతో ఈ రాశుల వారికీ ధన లాభంతో పాటు పెళ్లి కానీ వారి ఇంట్లో బాజాలు మోగనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశికి  అధిపతి శుక్రుడు. అటువంటి పరిస్థితిలో బృహస్పతి శుక్రుని నక్షత్రరాశిలో సంచరిస్తున్నాడు. బృహస్పతి యొక్క ఈ స్థానం 3 రాశుల వారికి భారీ ప్రయోజనాలను చేకూరబోతుంది. బృహస్పతి యొక్క రాశి మార్పు ఏ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకోండి-


వృషభ రాశి..
బృహస్పతి రోహిణి నక్షత్రంలోకి వక్ర గమనం వల్ల  వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి ప్రస్తుతం  రాశిలో  సంచరిస్తున్నాడు. ఈ సందర్బంగా ఈ రాశుల వారికీ ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న పనులు నెరవేరుతాయి. పెళ్లి కానీ ఆడ, మగ వాళ్లకు పెళ్లి అయ్యే సూచనలు పుష్కలంగా ఉన్నాయి.  అంతేకాదు మీరు కార్యాలయంలో సానుకూల ఫలితాలను అందుకుంటారు. పెట్టుబడులకు అనుకూలమైన సమయం.


సింహ రాశి..
బృహస్పతి రోహిణి నక్షత్రంలో వక్ర గమనం వల్ల సింహరాశి వారికీ  అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. పెళ్లి కానీ వారికీ ఈ యేడాది పెళ్లి పీఠలు ఎక్కే అవకాశాలున్నాయి. అంతేకాదు వ్యాపారంలో అనుకూల ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈ సమయం అత్యంత సానుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలను వింటారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. బృహస్పతి ప్రభావం వల్ల మీకు చాలా ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న డబ్బు చేతికి అందే అవకాశాలున్నాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి తరుణం. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.


ధనుస్సు రాశి..


ధనుస్పు రాశికి బృహస్పతి  ఆరవ ఇంట్లో తిష్ఠ వేసుకొని కూర్చొన్నాడు. ఈ సమయంలో మీ అదృష్టం  వరించే అవకాశం ఉంది. పెళ్లి కానీ వారికీ వివాహాం నిశ్చయమయ్యే అవకాశాలున్నాయి.  ధనుస్సు రాశిని పాలించే గ్రహం బృహస్పతి కాబట్టి వారికి ఈ సమయం  చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆస్తి లేదా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం.  కొత్త పనిని ప్రారంభించడానికి ఇది ఇదే మంచి తరుణం.  


పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Mediaకి ఎలాంటి సంబందం లేదు.


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter