Astrology: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. ఈ గ్రహాల కలయిక వల్ల కొన్ని అరుదైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. దాదాపు 72 యేళ్ల తర్వాత శ్రావణంలో అరుదైన గ్రహ యోగం ఏర్పడబోతుంది. నేటితో ఉత్తరాది వారికి శ్రావణ మాసం ప్రారంభమైతే.. మనకు ఆగష్టు 5 నుంచి శ్రావణం మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల రోజుల్లో లక్ష్మీ నారాయణ యోగంతో పాటు.. శశి రాజ్యయోగం, శుక్రాదిత్య రాజయోగం,బుధాదిత్య యోగంతో పాటు గజకేసరి యోగం ఏర్పడబోతున్నాయి. దీంతో ఈ నాలుగు రాశుల వారి జీవితంలో అనుకోని అదృష్టం కలగబోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి..
మేష రాశి వారికి ఈ నెలలో శివుడు ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి.  గత కొన్ని రోజులుగా పడుతున్న బాధలు తీరుతాయి. అనుకోని ధన ప్రవాహం మీ ఇంట చేరుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కెరీర్ లో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయి. వ్యావాపారస్తులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. వివాహా జీవితంలో సౌఖ్యం. గత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు.


సింహ రాశి..
శ్రావణ మాసంలో సింహ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా సాగిపోతుంది. అంతేకాదు మీ కెరీర్ లో అఖండమైన విజయాలను అందుకుంటారు. సమాజంలో మీ గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి. భూమి లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ తో కూడిన ఇంక్రిమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్ధులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.


ధనుస్సు రాశి..
ధనుస్సు రాశి వారి ఇది మంచి తరుణం. ఈ కాలంలో మీకు అదృష్టం వెంటాడుతుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆర్ధికంగా బలమైన అవకాశాలు ఏర్పడుతాయి. విద్యార్ధులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి పరంగా ఎదుర్కొంటున్న కష్టాలు వీడుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. బంధుత్వాల్లో ఉన్న పొరపొచ్చాలు తొలిగిపోతాయి. జీవిత భాగస్వామి మద్ధతుతో అనుకున్న పనులు నెరవేరుతాయి. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు.


కుంభ రాశి..
ఈ నెల రోజులు కుంభ రాశి వారికి అనుకోని అదృష్టం కలగనుంది. ఈ కాలంలో మీ పనులన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేస్తారు. కెరీర్ కు సంబంధించి శుభవార్తలు అందుకుంటారు. మీ సంపద అనూహ్యంగా పెరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు చేసేందుకు ఇదే అనుకూలమైన సమయం. కుటుంబ పరంగా ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధార్మిక పరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.



పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Mediaకి ఎలాంటి సంబందం లేదు.


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook