Astrology: జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాల్లో బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన దయ ఉంటేనే బుద్ధి, చదువు, పదవులు వంటివి వరిస్తాయి. దేవ గురువు బృహస్పతి వచ్చే యేడాది వరకు వృషభంలో సంచరించనున్నాడు. అయితే.. అక్టోబర్ 9న బృహస్పతి వృషభ రాశిలో తిరోగమనం చెందనున్నాడు. ఈ  స్థితి వచ్చే యేడాది ఫిబ్రవరి 9 వరకు ఉండనున్నారు. బృహస్పతి తిరోగమనం వల్ల ఈ రాశుల వారికీ అనుకోని లాభాలు కలగనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథున రాశి..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి వృషభంలో వక్ర గమనం వల్ల మిథున రాశి వారికి అనుకోని ఫలితాలు అందుకుంటారు. అంతేకాదు ఆదాయ వనరులు పెరుగుతాయి. డబ్బు రాకతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగనుంది.  ఖర్చులు తగ్గుతాయి. ఈ సమయంలో ఈ రాశుల వారికీ  ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా సక్సెస్ అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది.


కర్కాటక రాశి..
 బృహస్పతి తిరోగమనం వలన  ఈ రాశి వారికి అత్యంత  అనుకూల ఫలితాలను అందుకుంటారు. ఈ సమయంలో మీరు మీ ప్రయత్నాలలో విజయం సాధించే అవకాశాలున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు అందులో విజయం సాధిస్తారు.  మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరిగే అవకాశాలున్నాయి.  కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న డబ్బును తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.


ధనుస్సు రాశి..


వక్ర గమనంలో బృహస్పతి కారణంగా  ధనుస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది.  అదృష్టవశాత్తూ కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తతవుతాయి. గృహంలో సంతోషాలు వెల్లి విరుస్తాయి. వ్యాపారులకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ లో దూసుకుపోతారు. డబ్బు సంబంధిత విషయాలలో అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు.


పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Mediaకి ఎలాంటి సంబందం లేదు.


Also read: Prostate Cancer Signs: బాడీలోని ఈ 3 భాగాల్లో సమస్య ఉంటే ప్రోస్టేట్ కేన్సర్ కావచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook