Shani Sade Sati Remedies: శ్రావణ మాసం ఈ నెల 14న ప్రారంభమైంది. శనిగ్రహం జూలై 12న కుంభరాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించాడు. ఈ సమయంలో కొన్ని రాశులపై శనిమహాదశ, సడేసతి, ధైయా ప్రారంభమయ్యాయి. అసలు శనిమహాదశ (Shani Mahadasha) అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా వస్తుంది. మనుషుల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. అది మంచైనా లేదా చెడైనా కావచ్చు. దీంతోపాటు రాహువు యెుక్క మహాదశ కూడా రెండు సంవత్సరాలుపాటు కొనసాగుతుంది. ఈసమయంలో ఆ వ్యక్తి తీవ్ర మానసికవేదనను అనుభవించాల్సి ఉంటుంది. శని మహాదశ అందరికీ అరిష్టం కాదు, కొందరిని ధనవంతులను  కూడా చేస్తుంది. శనిమహాదశలో భాగమైన శని సడే సతి 7 సంవత్సరాలు మరియు ధైయా 2 సంవత్సరాల 6 నెలలుపాటు ఉంటుంది. శని ఏ రాశి నుండి 4వ మరియు 8వ స్థానాలలో ఉంటే దానిని ధైయా అంటారు. 


ఈ పరిహారం చేయండి
ఎవరైనా శని సడేసతి మరియు ధైయాతో బాధపడుతున్నట్లయితే శ్రావణ మాసంలో ఈ చర్యలు తీసుకుంటే మంచి జీవితాన్ని గడపవచ్చు. శ్రావణ శనివారం రోజు రుద్రాభిషేకం చేస్తే కాలసర్ప దోషం నుండి విముక్తి పొందవచ్చు. అదేవిధంగా సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టుకు నీరు పోసి దాని కింద దీపం వెలిగించండి. శని దేవుడికి నూనె మరియు నీలం పువ్వులు సమర్పించండి. పూజ చేసేటప్పుడు శని విగ్రహాన్ని నేరుగా చూడకండి. ప్రతి శనివారం స్నానం చేసిన తర్వాత నూనె దానం చేయండి. హనుమంతునికి కుంకుమ మరియు బెల్లం సమర్పించండి. రోజూ హనుమాన్ చాలీసా చదవండి.


Also Read: నాగపంచమి రోజు ఇంటి బయట ఈ ఒక్క పేరు రాయండి చాలు.. పాములు ఎప్పుడూ మీ ఇంట్లోకి రావు! 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook