Astrology: మే నెలలో దేవగురువు బృహస్పతి తన రాశిని మార్చుకోబోతుంది. మే 1న బృహస్పతి మేషం నుంచి వృషభంలోకి రాబోతుంది. అదే సమయంలో ప్రేమ, ఆకర్షణకు కారణమైన శుక్రుడు మే 19ర వృషభంలోకి ప్రవేశించనున్నాడు. బృహస్పతి, శుక్ర గ్రహాల కలయికతో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతోంది. అది కూడా దాదాపు 12 యేళ్ల తర్వాత ఈ అరుదైన కలయిక కొన్ని రాశుల వారికీ రాజయోగం కలిగించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి..
మేషరాశి వారికి గజలక్ష్మీ రాజ్యయోగం కారణంగా ఎక్కువ ప్రయోజనాలు పొందనున్నారు. లక్ష్మీ దేవి కృపతో వ్యాపారంలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. కొన్ని రోజులుగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. మరోవైపు ఖర్చుల విషయంలో నియంత్రణలో ఉండాలి. మనసు ఉల్లాసభరితంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అదే సమయంలో పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు.


సింహ రాశి..
శుక్రుడికి సంబంధించిన వృషభంలో బృహస్పతితో శుక్రుడి కలయిక అపూర్వ రాజయోగాన్ని అందిస్తోంది. ఈ యోగం సింహ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కారణంగా మీ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది.


కర్కాటక రాశి..
గురు, శుక్ర గ్రహాల కలయికతో ఏర్పడిన గజలక్ష్మి రాజయోగం కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ కెరీర్‌లో కొత్త శిఖరాలను అందుకుంటారు. అదే సమయంలో పెండింగ్‌లో ఉన్న డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. గత కొన్నేళ్లుగా వివాహాం కానీ వారి ఈ సారి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.



Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


ఇదీ చదవండి: No Electricity Bill: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. మార్చి నెల కరెంట్‌ బిల్లు కట్టనవసరం లేదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook