Astrology - Rahu Transit: జ్యోతిష్య శాస్త్రంలో రాహువును క్రూర గ్రహంగా అభివర్ణిస్తూ ఉంటారు. ఇవి వివిధ రాశుల వారికి మంచి స్థానంలో ఉంటే శుభ పలితాలతో పాటు ఆర్ధిక ప్రయోజనాలు అందిస్తాడు. అశుభ స్థానంలో చెడు ఫలితాలను ఇస్తూ ఉంటుంది. రాహువు లాస్ట్ ఇయర్ అక్టోబర్ 30 నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సందర్భంగా ఏయే రాశుల వారికీ శుభప్రదంగా ఉండబోతుందో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తుల రాశి:
రాహువు తులారాశికి ఏడవ స్థానంలో ఉన్నాడు. రాహువు మీన రాశిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి ఎక్కువ ప్రయోజనకరం. రాహువు అనుగ్రహం వల్ల ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న డబ్బులు వీరి చేతికి అందుతాయి. అంతేకాదు ఉద్యోగంలో ప్రమోషన్. వ్యాపారంలో లాభం కలిగే అవకాశాలున్నాయి. ఈ సమయంలో ఈ రాశుల వారు తమ భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయంలో భయపడవద్దు. ఈ టైమ్‌లో ఈ వ్యక్తుల ఆర్దిక పరిస్థితులు మెరుగుపడతాయి. సంఘంలో గౌరవం పెరుగుతోంది. బంధు మిత్రులతో సంబంధాలు మెరుగవుతాయి.


మిథున రాశి:


మిథున రాశి వారికి రాహు గ్రహ సంచారం వల్ల వ్యాపారంలో వృద్ది, ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి. రాహువు మిథున రాశికి పదవ ఇంట్లో మీనంలో ఉండటం వల్ల అనుకోని ధన లాభం కలిగే అవకాశాలున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న విజయాలు వీరిని వరిస్తాయి. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తోన్న వ్యక్తులకు విజయం వరించే అవకాశం ఉంది. ఏదైనా కొత్త పనిని మొదలు పెట్డడానికి ఇదే మంచి తరుణం.


కుంభ రాశి:
కుంభరాశి వారికి రాహువు సంచారం అపార ధనయోగాన్ని ఇవ్వనుంది. ఈ యేడాది మొత్తం వీరికి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా వీరి కెరీర్ సాగిపోతుంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతోంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్థులకు ఇది మంచి కాలం. అంతేకాదు బంధు మిత్రులతో ఎక్కువ సమయం గడపుతారు.  


Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


ఇదీ చదవండి: Dengue Fever: మంత్రికి సోకిన డెంగీ వ్యాధి.. మేడారం జాతర ఎలా జరుగునోనని ఆందోళన..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook