Astrology: ప్రస్తుతం శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచరిస్తున్నాడు. ఇక కొద్ది రోజుల క్రితమే బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. అక్కడ రవి ఇప్పటికే ఉన్నాడు. శని, బుధ, రవి కలయికతో ఈ రాశుల వారికి మార్చి 6వ వరకు అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి..
మేషరాశికి కుంభరాశిలో శని, సూర్య, రవి కలయిక వల్ల ఏర్పడ్డ యోగం వల్ల పలు ప్రయోజనాలు దక్కనున్నాయి. వీరికి కార్యక్షేత్రంలో వచ్చే కష్టాలు తీరే అవకాశాలున్నాయి. వ్యాపారంలో ధనలాభం పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు తమ యజమాని, సహోద్యోగుల మద్దతును పొందే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి విహార యాత్రలు చేసే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది.


కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారికీ రవి, బుధ, శనిదేవుడి కలయిక చాలా శుభప్రదంగా భావిస్తారు. గత కొన్నేళ్లుగా వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలిగిపోతాయి. బుధ, సూర్యుని అనుగ్రహంతో విద్యార్ధులు చదువుపై ఏకాగ్రత వహిస్తారు. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగనే ఉంటుంది. అదే సమయంలో గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న ఆర్ధిక కష్టాలు తొలిగిపోతాయి.


సింహ రాశి..
శని, బుధ, సూర్యుడి కలయిక వల్ల సింహరాశి వారికీ అత్యంత ప్రయోజనకరగా ఉంటుంది. బుధ, సూర్యుడి శుభ ప్రభావం కారణంగా వ్యాపార సంబంధిత ప్రణాళికల్లో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. అదే సమయంలో సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. అదే సమయంలో కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. అంతేకాకుండా బుధుడి అనుగ్రహంతో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.


Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


ఇదీ చదవండి: KTR Gifts: విద్యార్థులకు కేటీఆర్‌ 'అమూల్యమైన కానుక'.. చిన్నదే అయినా ఎంతో ప్రత్యేకం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook