Jyotish Shastra: చిరిగిన బట్టలు, బూట్లు లేదా వాలెట్ ఉపయోగించకూడదని తరుచూ పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది వాటిని తమ అదృష్టంగా భావిస్తారు. వాటిని ఎల్లప్పుడూ తమతో ఉంచుకుంటారు. మనలో చాలా మంది ఇలాంటి వాటిని ఒక సారి మాత్రమే ఉపయోగించి..వాటి స్థానంలో కొత్త వాటిని కొనుక్కోంటారు. కానీ పర్స్ (Old Purse) విషయానికొస్తే.. అది చెడిపోయిన విసిరేయకండి. ఎందుకంటే అది మిమ్మిల్ని ధనవంతుల్ని చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాత పర్స్‌తో ఏమి చేయాలి?
>>  మీరు మీ పాత పర్స్‌ను కొత్తదానితో భర్తీ చేస్తున్నప్పుడు, మీ పాత పర్స్‌లోని వస్తువులను ఖాళీ చేసి కొత్త పర్స్‌లో ఉంచండి. ఆ తర్వాత పాత పర్సును ఎర్రటి గుడ్డ చుట్టి రూ.1 నాణెం ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ పాత పర్సులో డబ్బు నిల్వ ఉండే శక్తి అలాగే ఉంటుంది. 
>>  మీ పాత పర్స్ మీకు అదృష్టమైతే, దాన్ని విసిరే తప్పును ఎప్పుడూ చేయకండి మరియు పర్సును ఖాళీగా ఉంచకండి. మీరు పాత పర్స్‌లో కొన్ని బియ్యం గింజలను ఉంచుకోవచ్చు. తర్వాత మీరు ఈ బియ్యం గింజలను మీ కొత్త పర్స్‌కి బదిలీ చేయండి. ఇలా చేయడం వల్ల మీ పాత పర్సులోని పాజిటివ్ ఎనర్జీ కొత్త పర్సులోకి ప్రవహిస్తుంది. 


>>  మీకు మీ పాత పర్సు అంటే చాలా ఇష్టం మరియు మీరు దానిని విసిరేయకూడదనుకుంటే, మీరు ఆ పర్స్‌పై ఎర్రటి గుడ్డను చుట్టి మీ వద్దే భద్రంగా ఉంచుకోవచ్చు. అయితే పర్సును సేఫ్‌లో ఉంచినప్పుడు అది ఖాళీగా ఉండకూడదని గుర్తుంచుకోండి. అందులో రుమాలు, బియ్యం, డబ్బు ఏదైనా ఉంచుకోవచ్చు. 
>>  మీ పాత పర్స్ చిరిగిపోయి, దానిని మీ దగ్గర ఉంచుకోవాలనుకుంటే, దాన్ని పూర్తిగా రిపేర్ చేసిన తర్వాత మాత్రమే మీ వద్ద ఉంచుకోండి. చిరిగిన పర్సును మీ దగ్గర ఉంచుకుంటే అది మీ రాహువును బలహీనపరుస్తుంది. దీని కారణంగా మీరు డబ్బును కోల్పోవచ్చు.


Also Read: Astro tips for money: మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోతే చిటికెలో తిరిగి వస్తుంది.. ఇలా చేయండి!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.