Astrology:  ప్రతి యేడాది చైత్ర శుక్ల పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి వారి జయంతిని జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. మరోవైపు వైశాఖ బహుళ దశమి నాడు కూడా కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతిని ఎంతో వేడుకగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ యేడాది హనుమాన్ జయంతి రోజున వివాహాది ఇతర శుభ కార్యాలకు కారుకుడైన కుజుడి రాశి మార్పు కారణంగా ఈ రాశుల వారికీ అప్రయత్నంగా పెళ్లి ప్రయత్నాలు ఫలించబోతున్నాయట.  
మంగళ్ గోచార్ హనుమాన్ జన్మోత్సవం 20 అంశాలు.. భూమి, భవనం, వాహనం, శౌర్యం, విజయం, కీర్తి, యుద్ధం, ధైర్యం, జీవితం, శక్తి, కోపం, ఉత్సహాం మొదలైనవి కుజ గ్రహా మార్పు కారణంగా సంభవించేవే. చైత్ర శుక్ల పౌర్ణమి రోజున కుజుడు కుంభం ఒదిలి మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుజుడు మీనరాశిలోకి ప్రవేశించడంతో ఇప్పటికే ఆ రాశిలో సంచరిస్తోన్న రాహువుతో కలయిక ఉంటుంది. ఫలితంగా అంగారకుడి ప్రభావంలో మార్పు వస్తుంది.
కుజుడు దాదాపు జూన్ 1 వరకు మీనంలో సంచరించబోతున్నాడు.  ఈ కారణంగా రాశి చక్రంలో మేష రాశి నుంచి మీనం వరకు  ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతుందో మీరు ఓ లుక్కేయండి..


మేష రాశి..
మేష రాశి వారికీ కుజుడు మీనంలో ప్రవేశించడంతో వీళ్లలో ధైర్య సాహసాలు.. ఒత్తిడి పెరిగే అవకాశం.. పోటీలో విజయం సాధించే పరిస్థితులు ఏర్పుడుతాయి. మేషం స్వతహాగా సొంత రాశి అయినందున కొన్ని లాభాలను చేకూర్చును. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వివాహా ప్రయత్నాలు అప్రయత్నంగా ఫలిస్తాయి. మరోవైపు దూర ప్రయాణాలు చేస్తారు.


వృషభ రాశి..
ఆర్ధిక కార్యకలాపాలు మెరగువుతాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార వాణిజ్యాలల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామికి సంబంధించి ఖర్చులు పెరుగుతాయి. పిల్లల పూర్వకంగా శుభవార్తలు వింటారు.


మిథున రాశి..
ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి మార్పు అవకాశం.. ఆర్ధిక కార్యకలాపాల్లో ఆకస్మిక పెరుగుదలకు అవకాశం. గుండెకు సంబంధించిన విషయంలో కేర్ తీసుకోవాలి. వివాహా ప్రయత్నాల్లో అనుకూలత. ఆరోగ్యం కారణంగా శ్రమకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది.


కర్కాటక రాశి..
తోబుట్టువులు.. స్నేహితుల సహాకారంతో మీ జీవితంలో పెను మార్పులు. కోపం ఆకస్మికంగా వచ్చిపడుతోంది. గృహ, వాహన వినియోగంలో పెరుగుదల ఉంటుంది. చదువులు మరియు బోధనకు సంబంధించిన వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది. సాంకేతిక అంశాలకు సంబంధించిన వ్యక్తులకు మంచి సమయం ఉంటుంది.


సింహ రాశి..
సింహ రాశి వారికి ఆర్ధిక కార్యకలాపాలు మెరుగవుతాయి. ప్రసంగం యోక్క తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు మెరుగవుతాయి. తల్లి ఆరోగ్యంపై అనవసర ఆందోళన వ్యక్తం చేయవద్దు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయి. మాటలను ఆచితూచి మాట్లాడాలి.


కన్య రాశి..
కుటుంబ విషయాల్లో ఒత్తిడికి లోను కావొద్దు. ఇతరులతో మాట్లాడేటపుడు ఎంతో ఆచితూచి మాట్లాడాలి. మానసిక ఆందోళనకు గురికావొద్దు. ఆర్ధిక ప్రయోజనాలు సాధ్యమవుతాయి. శ్రమకు ఆటంకం కలిగించే పరిస్థితి. కోపం పెరిగే అవకాశాలున్నాయి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో మాటా మాటా పెరిగే అవకాశాలున్నాయి. పార్టనర్‌ షిప్‌లో చేసే వ్యాపారాల్లో అప్రమత్తత అవసరం.


Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


Also Read: TDP Candidates Change: ఎన్నికల వేళ టీడీపీ భారీ ట్విస్ట్‌.. రఘురామ కృష్ణంరాజుకు ఛాన్స్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter