Astrology Predictions by Name : జ్యోతిష శాస్త్రంలో రాశిచక్ర గుర్తులతో ఒక వ్యక్తి భవిష్యత్తును ఎలా చెప్పవచ్చో.. అదే విధంగా ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి అతని భవిష్యత్తు గురించి చెప్పొచ్చునని ఆస్ట్రాలజీ నిపుణులు చెబుతుంటారు. పేరు ఒక వ్యక్తి జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది. కొంతమంది వ్యక్తులకు పేర్లు కలిసిరావడం వల్ల ధనవంతులు అవుతారు. అలా ధనవంతులయ్యే అవకాశం ఏ పేర్లకు ఉందో ఒకసారి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్షరం 'బి' :


'B' అక్షరంతో మొదలయ్యే పేర్లు కలిగిన వ్యక్తులు చాలా కష్టపడే తత్వం కలవారు. వారు చాలా అదృష్టవంతులు కూడా. తమ తెలివి తేటలతో చిన్న వయసులోనే ఎన్నో విజయాలు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు.


అక్షరం 'డి' :


పేరు 'D' అక్షరంతో మొదలయ్యే వ్యక్తులను అదృష్టం వెన్నంటే ఉంటుంది. కష్టపడే తత్వంతో వీరు ముందుకు సాగుతారు. కష్టపడి పనిచేయడం వల్ల జీవితంలో అన్నీ పొందుతారు. తమ తెలివితేటలతో చిన్నవయసులోనే నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. సుఖ, సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు.


అక్షరం 'హెచ్' : 


'H' అక్షరంతో మొదలయ్యే పేర్లు కలిగిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు. వీరు ఏ పనిలో తలపెట్టినా విజయం సాధిస్తారు. చిన్న వయసులోనే జీవిత లక్ష్యాలను చేరుకుంటారు. వీరి వద్ద సంపద ఎప్పుడూ ఉంటుంది.


అక్షరం 'ఎల్' :


పేరు 'L' అక్షరంతో మొదలయ్యేవారు చాలా తెలివైనవారుగా గుర్తింపు పొందుతారు. వారికి అదృష్టం కూడా తోడవుతుంది. జీవిత కాలంలో వారికి ఎటువంటి సౌకర్యాల కొరత ఉండదు. చిన్న వయస్సులోనే గొప్ప విజయాలు సాధిస్తారు. అందరిచేత ప్రశంసలు పొందుతారు.


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: How To Break shivratri Fasting: శివరాత్రి ఉపవాసం తర్వాత ఇవి తింటే ఆరోగ్యానికి మంచిదట


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook