Jupiter Closure: ఆకాశంలో మరో అద్భుతం జరగనుంది. సెప్టెంబర్ 26న జరిగే అరుదైన దృశ్యం ఏకంగా 60 ఏళ్ల తరువాత జరుగుతోంది. బృహస్పతి గ్రహం భూమికి అత్యంత చేరువలో రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఖగోళ శాస్త్రంలో జరిగే అద్భుతాలకు జ్యోతిష్యశాస్త్రంలో మహత్యముంది. ప్రతి గ్రహం కదలిక ప్రభావం ఆ వ్యక్తి జీవితంపై కన్పిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 26వ తేదీన ఓ అద్భుతమై దృశ్యం తొలిసారిగా కన్పించనుంది. ఈ ఘటన ఏకంగా 60 ఏళ్ల తరువాత జరుగుతోంది. ఇంతకుముందు ఈ ఘటన 1963లో జరిగింది. గురుగ్రహం భూమికి అత్యంత చేరువకు రావడమే ఈ ఘటన. చాలా ఆకర్షణీయంగా కన్పిస్తుంది. జ్యోతిష్యశాస్త్రంలో ఈ ఘటన ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..


జ్యోతిష్యం ప్రకారం గురు గ్రహం భూమికి ఇంత చేరువలో రావడం, సూర్యుడికి సమీపంలో ఉండటం వల్ల ఆ ప్రభావం అంతటా పడుతుంది. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు, బీహార్, బెంగాల్‌లో వర్షాలు అధికంగా ఉంటాయి. అటు జ్యోతిష్యం ప్రకారం కూడా ఇది చాలా మంచిది. ఈసారి దుర్గాదేవి ఏనుగెక్కి వస్తుంది. గురుగ్రహం వాహనం కూడా ఏనుగే. అటు నవంబర్ నెలలో భారీ వర్షాలు పడనున్నాయి.


గురుగ్రహం భూమికి సమీపంలో రావడం వల్ల ఆ ప్రభావం అందరికీ కన్పిస్తుంది. ఈ ఘటనతో ప్రజల ధార్మికత పెరుగుతుంది. ప్రజల విశ్వాసం పెరుగుతుంది. దాంతోపాటు భక్తి కూడా పెరుగుతుంది. సూర్యగ్రహణానికి ముందు బంగారం ధరలు తగ్గనున్నాయి. షేర్ మార్కెట్‌లో లాభాలుంటాయి. సూర్యగ్రహణం తరువాత పడిపోతుంది.


సెప్టెంబర్ 25, 26 తేదీల్లో ఇది భూమి నుంచి స్పష్టంగా కన్పిస్తుంది.సెప్టెంబర్ 25 అంటే ఇవాళే గురు గ్రహం భూమికి అత్యంత చేరువకు వస్తోంది. సెప్టెంబర్ 26వ తేదీన సూర్యుడికి వ్యతిరేక దిశలో కన్పిస్తాడు. భూమికి చేరువైన కారణంగా చాలా ఆకర్షణీయంగా కన్పించనున్నాడు. వాతావరణం స్పష్టంగా ఉంటే గురుడు క్లియర్‌గా కన్పిస్తాడు.


Also read: Astro Tips: ఈ పువ్వును ఇలా ఉపయోగిస్తే.. మీ దారిద్య్రం పోయి ధనప్రాప్తి కలుగుతుంది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook