Lucky Gemstones: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి ఓ రత్నం ఉంటుంది. రత్నశాస్త్రం ప్రకారం గ్రహాల ప్రభావం పెంచేందుకు లేదా అశుభ ప్రభావాన్ని తగ్గించేందుకు సంబంధిత రత్నాలు ధరించడం ఆవశ్యకం. మరి సింహరాశివారు ఎలాంటి రత్నాలు ధరించాలో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రహాల పరిస్థితిని బట్టి వ్యక్తికి ఏ రత్నం ధరించాలో తెలుసుకోవాలి. కుండలిలో గ్రహాలు సరైన స్థితిలో లేకపోతే అంటే నష్టం కల్గించే పరిస్థితుల్లో ఉంటే రత్నం ధరించాలని చెబుతారు జ్యోతిష్య పండితులు. వ్యక్తి కుండలిలో గ్రహాల దశ అనేది మెరుగౌతుంది లేదా పాడౌతుంది. రత్నశాస్త్రం ప్రకారం, రాశి ఆధారంగా రత్నాన్ని ధరిస్తే సమస్యల్ని చాలావరకూ తగ్గించుకోవచ్చు. సింహ రాశి జాతకులు ఏ విధమైన రత్నాన్ని ధరించాలి, కలిగే ప్రయోజనాలేంటనేది తెలుసుకుందాం.


కుండలిలో సూర్యుడు బలహీనంగా ఉంటే..


సింహ రాశికి గురువు సూర్యుడే. ఈ పరిస్థితుల్లో ఎవరి జాతకపు కుండలిలోనైనా సూర్యుడు బలహీనంగా ఉంటే అతడు మాణిక్య రత్నాన్ని ధరించాలని చెబుతారు జ్యోతిష్యులు. మాణిక్య రత్నం సంబంధం నేరుగా సూర్యుడితోనే ఉంటుంది. సూర్యుడి బలహీనంగా ఉండి..ఇతర గ్రహాలు బలంగా ఉన్నా మంచి జరగదు. ఈ క్రమంలో సూర్యుడిని పటిష్టం చేసేందుకు మాణిక్య రత్నం ధరించాలి. పింక్ రూబీ అని కూడా పిలుస్తారు. 


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు బలహీనంగా ఉంటే గౌరవ మర్యాదలు తగ్గుతాయి. జీవితంలో అభివృద్ధికి సంబంధించి ఆటంకాలు ఎదుర్కొంటాడు. అంతేకాదు..గుండె సంబంధిత వ్యాధులకు గురవుతాడు. సింహరాశికి గురువు సూర్యుడు. అందుకే మాణిక్యం ధరిస్తే ఈ రాశివారికి అది నిజంగా వరం లాంటిదే. ఈ రత్నాన్ని ధరించడం వల్ల సింహరాశివారి కెరీర్‌లో విజయం లభిస్తుంది. 


రత్నశాస్త్రం ప్రకారం సింహరాశి జాతకులు టోపాజ్, ఆనిక్స్, డైమండ్‌లు చాలా లక్కీ స్టోన్స్. డైమండ్ రత్నం స్థానంలో ఓపెల్ కూడా ధరించవచ్చు. అదే మహిళలకైతే ఫుఖ్రాజ్, జేస్పర్ స్టోన్స్ మంచిదని చెబుతారు. 


రత్నశాస్త్రం ప్రకారం మాణిక్యం ధరించి సూర్యుడి ఉపాసన, సూర్యుడి పూజ చేయడం వల్ల ప్రతిఫలం రెట్టింపవుతుంది. మాణిక్యం ధరించడం వల్ల సూర్యుడి ప్రభావిత రోగాలైన గుండె సమస్య, కంటి సమస్య, పిత్త సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన పనుల్లో విజయం లభిస్తుంది. అభివృద్ధి సాధించేందుకు మాణిక్య రత్నం మంచి ఉపయోగకరం. పింక్ రూబీ ధరించడం వల్ల వ్యక్తికి అంతర్గత శక్తి,ఆత్మబలం పెరుగుతుంది. అంతేకాకుండా పనిచేసే చోట వృద్ధి లభిస్తుంది.


Also read: Shanichar Amavasya 2022: శనీచర అమావాస్య నాడు శనిపీడ నుంచి విముక్తులయ్యేందుకు ఏం చేయాలి, ఆగస్టు 27 ఉదయం ఏమౌతుంది ఆ రాశులకు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook