Astro tips for pooja: హిందూమతకంలో దేవీదేవతల పూజలకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. పూజల గురించి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అందుకే పూజ చేసేటప్పుుడు ఏ విషయాల్ని పరిగణలో తీసుకోవాలో తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేవీ దేవతల పూజల ప్రాధాన్యత గురించి శాస్త్రాల్లో విపులంగా ఉంది. హిందూమతంలో కొన్ని నియమాల గురించి చర్చించారు. ఒకవేళ పూజ చేసేటప్పుడు కొన్ని విషయాల్ని పరిగణలో తీసుకోకపోతే..పూజల ఫలితం లభించదట. దాంతోపాటు దేవతలు ఆగ్రహానికి లోనవతారు. నిర్ణీత పద్ధతిలో భక్తిశ్రద్ధలతో, అన్ని సూచనలు పరిగణలో తీసుకుని పూజలు చేస్తేనే వ్యక్తి జీవితంలో పాజిటివిటీ అభివృద్ధి చెందుతుంది. అదే సమయంలో ఆ నియమాల్ని పట్టించుకోకపోతే..దారిద్ర్యం విరాజిల్లుతుందని చెబుతున్నారు పండితులు. ఇంట్లో నెగెటివ్ శక్తులు వ్యాపిస్తాయి. పూజాది కార్యక్రమాల్లో కొన్ని వస్తువుల్ని పొరపాటున కూడా నేలపై పెట్టకూడదు. 


హిందూమతంలో శంఖాన్ని పవిత్రంగా భావిస్తారు. పూజాది కార్యక్రమాలు, మతపరమైన కార్యక్రమాల్లో శంఖం పూరించడం శుభానికి సూచకం. సముద్ర మథనం సందర్భంగా శంఖం పుట్టిందని చెబుతారు. ఇంట్లోని మందిరంలో లక్ష్మీదేవి చెంతన శంఖం పెట్టడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమౌతుంది. వ్యక్తి ఇంట్లో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఈ క్రమంలో పొరపాటున కూడా ఆ శంఖాన్ని నేలపై పెట్టకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి అగౌరవం కలుగుతుందట. ఆగ్రహ చెంది ఇంట్లోంచి వెళ్లిపోతుందని అంటారు. 


శాస్త్రాల ప్రకారం ఒకవేళ వ్యక్తి నియమిత పద్ధతిలో విధి విధానాలతో పూజలు చేయలేకపోయినా..కనీసం నియమం ప్రకారం దీపాన్ని వెలిగించినా సరే..ఆ శుభ ఫలితం లభిస్తుందట. ఒకవేళ మీరు దీపం మాత్రమే వెలిగిస్తకుంటే..ఆ దీపాన్ని పూజా మందిరంలో ఏదైనా స్టాండ్ లేదా పూజచేసే పళ్లెంలో మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. దీపాన్ని పొరపాటున కూడా నేలపై ఉంచకూడదు. దీనివల్ల దేవతలకు కోపమొస్తుంది. అంతేకాకుండా పూజకు ఉపయోగించే పూవులు, మాల, పూజ సామాన్లను కూడా కటికనేలపై ఉంచకూడదు. 


రత్నం సంబంధం ఏదో ఒక గ్రహంతో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రత్నాన్ని చాలా శుభసూచకంగా భావిస్తారు. అందుకే రత్నంతో చేసిన నగలు నేలపై ఉంచడం అశుభంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో అశుభ పరిణామాలు ఎదురౌతాయి. దీనివల్ల కుటుంబంలో ధన సంపద, అభివృద్ధి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.


శాస్త్రాల ప్రకారం దేవుడి విగ్రహం లేదా బొమ్మను నేలపై ఉంచకూడదు. ఇలా చేస్తే ఇంట్లో సుఖ సంతోషాలు దూరమౌతాయి. అందుకే మందిరాన్ని శుభ్రపర్చేటప్పుుడు దేవుడి విగ్రహం లేదా బొమ్మల్ని ఏదైనా దుప్పటి లేదా గుమ్మంపైనే ఈ విగ్రహాలు పెట్టాల్సి ఉంటుంది. 


Also read: Mangal Gochar 2022: జూన్ 27న మేష రాశిలో కుజుడి సంచారం.. 40 రోజులు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook