Shani Favourite Zodiac: ఈ 3 రాశులంటే శని దేవుడికి చాలా ఇష్టం.. వీరిపై శని చెడు ప్రభావం ఉండదు..
Shani Favourite Zodiac: జ్యోతిష్యశాస్త్రం శని ఆగ్రహం ఎంత నష్టం చేస్తుందో.. శని అనుగ్రహం అంత శుభం చేస్తుంది. శనికి 3 ఇష్టమైన రాశులు ఉన్నాయి. ఆ 3 రాశుల వారిపై శని చెడు ప్రభావం ఉండదు.
Shani Favourite Zodiac: శని దేవుడు అంటే న్యాయ దేవత. కర్మానుసారం ఫలితాలనిచ్చేవాడు. శని ఆగ్రహానికి గురైతే ఆ బాధలు, కష్టాలు వర్ణనాతీతం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని సంచారం కొన్ని రాశుల వారికి కలిసొస్తే కొన్ని రాశుల వారికి కీడు చేస్తుంది. శని సంచారం ఎలా ఉన్నప్పటికీ 3 రాశుల వారిపై శని అనుగ్రహం ఉంటుంది. ఒకవేళ శని చెడు దృష్టి పడినా మిగతా రాశులతో పోలిస్తే ఆ ప్రభావం తక్కువే ఉంటుంది. ఒకరకంగా శని దేవుడికి ఈ 3 రాశులు ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇంతకీ ఆ 3 రాశులు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం...
తుల రాశి (Libra) - శని దేవుడికి ఇష్టమైన రాశుల్లో తుల రాశి ఒకటి. ఈ రాశి వ్యక్తులు కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు. అబద్దాన్ని, తప్పును సహించరు. ఎల్లప్పుడూ సత్యం వైపు నిలబడే మనుషులు. ఇతర రాశులతో పోలిస్తే శని సంచారం వీరిని అంతగా ప్రభావం చేయదు.
మకరం (Capricorn) - మకర రాశికి శని దేవుడు అధిపతి. శనికి ఇష్టమైన రాశుల్లో మకర రాశి కూడా ఉంది. సహజంగా మకర రాశి వారు తెలివైన వ్యక్తులు. ఏ పని చేసినా శక్తి వంచన లేకుండా కష్టపడుతారు. ఏదైనా తమ నుంచి దూరమయ్యే పరిస్థితి వస్తే.. అంత సులువుగా వదులుకోరు. శని సంచారం వీరిపై ప్రభావం చూపదు.
కుంభం (Aquarius) - జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభ రాశికి కూడా శని దేవుడే అధిపతి. ఈ రాశి వారు నిరాడంబరతను ఇష్టపడుతారు. ఓర్పు, సహనం కలిగి ఉంటారు. అనుకున్న పనులను అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా మంచి స్థానంలో ఉంటారు. కుంభ రాశి వారిపై శని చెడు దృష్టి ఉండదు.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు. సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Godavari Floods LIVE:భద్రాచలం సేఫేనా?మరో నాలుగు గంటలు గడిస్తేనే.. రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే..
Also Read: Oppo A97 5G Price: రూ.23 వేలకే ఒప్పో కొత్త 5జీ ఫోన్.. సూపర్ స్పెసిఫికేషన్‌లు ఇవే!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.