3 Burner Gas Stove Vastu Tips: ప్రస్తుతం అందరు ఉరుకులు, పరుగుల జీవితంను గడుపుతున్నారు.అందరు బిజీలైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఒకప్పడు ఇంట్లో ఇంతలా బిజీగా ఉండేవారు కాదు. అందుకే రెండు పొయ్యిలు ఉంటే సరిపోయేవి. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఇంట్లో భార్యభర్తలు ఉద్యోగస్తులుగా ఉంటున్నారు. వీరి ఆఫీసులకువ వెళ్లే హాడావిడీ, పిల్లలకు స్కూల్ లకు పంపడం వంటివాటిల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో రెండు పోయ్యిల స్టౌవ్ ఎక్కడ కూడా సరిపోదు. అందుకే ట్రెండ్ కు తగ్గట్టుగా ఇప్పుడు మార్కెట్ లో మూడు పొయ్యిలు ఉన్న స్టౌవ్ లు, నాలుగు బర్నర్ లు ఉన్న స్టౌవ్ లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే దీనిపై కొందరు మాత్రం అనేక వదంతులు తరచుగా వింటు ఉంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Snake Attack: పాముతో లిప్ లాక్ కోసం ట్రైచేశాడు.. ట్విస్ట్ మాములుగా లేదుగా..అసలేం జరిగిందంటే..?


మూడు బర్నర్ లు ఉన్న స్టౌవ్ లు వాడొద్దని చెబుతుంటారు. అయితే.. పూర్వకాలంలో అందరు జాయింట్ ఫ్యామిలీగా ఉండేవారు. ఒకే ఇంట్లో చాలా మంది ఉండేవారు. అప్పుడు గదులు కూడా కాస్తంతా ఇరుకుగా ఉండేవి. దీంతో పొయ్యిలు పెట్టడానికి కూడా తక్కువగా ప్రదేశం ఉండేది. దీంతో ఎవరికి వారు పొయ్యిలు పెడతామంటే ఇంట్లో స్థలం సరిపోదు. అంతే కాకుండా.. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉండేది. అందుకే ఒకే ఇంట్లో రెండు, మూడు పొయ్యిలు పెట్టొద్దని చెబుతుండేవారు.


అంతేకాకుండా పాతకాలంలో కిచెన్ లో ఒక పొయ్యి, మరల వేడి  నీళ్లు పెట్టుకొవడానికి ప్రత్యేకంగా స్టౌవ్ లు ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. కిచెన్ లోనే అన్ని చేసుకొవాలి. అన్నం, పప్పు, టిఫిన్ లు చేసుకుంటాం. అందుకే రెండు స్టౌవ్ లు ఎక్కడకూడా సరిపోవు. అందుకే.. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇళ్లలో మూడు లేదా నాలుగు బర్నర్ ల స్టౌవ్ లను ఎక్కువగా పెట్టుకుంటున్నారు. కాలంను బట్టి మనం కూడా   మారుతూ ఉండాలని, అప్పటి సంఘటనలను ఇప్పుడు అన్వయించుకోకుడదంటూ కూడా కొందరు పెద్దలు చెబుతుంటారు.


Read More: Bus Ticket For Parrots: ఇదేం విడ్డూరం.. చిలుకలకు రూ. 444 టికెట్ కొట్టిన కండక్టర్..


మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి కొన్నింటిని  వదిలేస్తు, మరికొన్ని పాటిస్తూ ముందుకు వెళ్లాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మూడు స్టవ్ లు ఉండటం వల్ల ఎలాంటి నష్టం ఉండదని సూచిస్తున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook