Astrology - Venus Transit: మే 19న కళలకు నిలమైన శుక్రుడు మేషం నుంచి తన సొంత రాశి అయిన వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు భౌతిక ఆనందం, భార్యాభర్తల అనుబంధానికి , లగ్జరీ, కీర్తి, కళలు, ప్రతిభ, అందం, ఆకర్షణ, శృంగారం, కామంతో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ లకు శుక్రుడు కారకుడు. శుక్రుడికి వృషభం,తుల రాశులకు అధిపతి. మీనం శుక్రుడికి ఉచ్ఛ స్థానమైతే.. మీనం నీచం అని చెప్పాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మేష రాశి..


శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించడంతో మేష రాశి వారికీ అనుకూలంగా ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. ధైర్యం పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో సమయం గడపుతారు. పనిలో విజయ అవకాశాలు మెరుగువుతాయి. అదృష్టం మీ తలుపు తడుతోంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని లాభాలుంటాయి. మీరు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.


మిథున రాశి..
ఉద్యోగ, వ్యాపారాలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. చేసే పనిలో గౌరవం అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందభరితంగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. శుభ వార్తలు అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి అందుకునే అవకాశాలున్నాయి. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికీ ఇదే శుభ తరుణం. విద్యారంగంలో ఉన్నవారికీ ఇంత కంటే శుభ సమయం దొరకదు. లావాదేవీలకు అనుకూలమైన సమయం.
 


సింహ రాశి
శుక్రుడు వృషభ రాశి ప్రవేశంతో సింహ రాశి వారికీ అనుకోని లాభాలు కలగనున్నాయి. ముఖ్యంగా కుటుంబ సంబంధాల్లో బాధ్యతలు అనుబంధాలు పెరుగుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తోన్న వారికీ శుభవార్తలు అందుకుంటారు. మీకు ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆర్ధికంగా ఉన్నత స్థానంలో ఉంటారు. డబ్బు సంబంధిత విషయాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పదవి, ప్రతిష్ఠ పెరుగుతాయి. పెట్టుబడి పూర్వక ధన లాభం ఉంటుంది.


Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.