Shani Margi In October 2022: నిన్న శని గ్రహం తన రాశిని మార్చింది. కుంభరాశిలో తిరోగమనంలో ఉన్న శని జూలై 12న మకరరాశిలోకి ప్రవేశించింది. మకరరాశిలో తిరోగమన శని (Shani Retrograde In Capricron 2022) ప్రభావం వల్ల కొన్ని రాశులపై శని సడేసతి మరియు ధైయా తొలగిపోయాయి. మరికొన్ని రాశులపై శనిమహాదశ మెుదలైంది.  మకరరాశిలో శని  గ్రహం 141 రోజులపాటు ఉండనుంది. జూన్ 5 నుండి అక్టోబర్ 22 వరకు శని తిరోగమన స్థితిలోనే ఉంటుంది. అక్టోబర్ 23 నుంచి నార్మల్ స్థితిలో సంచరించనుంది. మళ్లీ 2023 జనవరి 17న శని కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో శని వక్ర దృష్టి నుంచి బయటపడాలంటే కొన్ని పరిహారాలు చేయాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని యెుక్క పరిహారాలు
>>  శని యొక్క చెడు దృష్టి నుండి తప్పించుకోవడానికి శనివారం ఉపవాసం ఉంటూ శని దేవుడిని పూజించండి. 
>> శని చాలీసా పారాయణం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.  
>>  శని మంత్రాలను పఠించడం వల్ల లాభం చేకూరుతుంది. 
>>  శనిదేవుడికి సంబంధించిన నల్ల నువ్వులు, ఇనుము, నల్లని వస్త్రాలు మొదలైన వాటిని శనివారం దానం చేయడం మంచిది.
>>  బడుగు బలహీన వర్గాల ప్రజలను ఎప్పుడూ బాధించవదద్దు.  


>>  అవసరమైన వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి.
>>  తప్పుడు పనులు చేసే వారికి శనిదేవుడు అశుభ ఫలితాలను ఇస్తాడు. అందుకే చెడ్డ పనుల జోలికి వెళ్లకండి.  
>>  జంతువులు మరియు పక్షులకు సేవ చేయండి. వాటికి ధాన్యాలు మరియు నీరు ఇవ్వండి.
>>  తీవ్ర  అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు సహాయం చేయడం ద్వారా శని అనుగ్రహం కూడా లభిస్తుంది. 


Also Read: Sravana Masam 2022: రేపటి నుంచే శ్రావణ మాసం ప్రారంభం... ఈ మాసంలో చేయాల్సినవి, చేయకూడనవి? 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook