COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

August Shukra Gochar Effects: శుక్రుడి సంచారాన్ని ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ గ్రహం దాదాపు ఏడాది తర్వాత సింహ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. సింహ రాశిలో అప్పటికే బుధుడు కూడా ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా శుక్రుడు, బుధుడి కలయిక జరగబోతోంది. అంతేకాకుండా ఆగస్ట్ నెలలో సూర్యుడు కూడా సింహ రాశిలోకి ప్రవేశించబోతోంది. దీంతో ఎంతో శక్తివంతమైన శుక్రాదిత్య యోగం ఏర్పబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో సింహ రాశిలో  శుక్రుడు, బుధుడు,  సూర్యుని కలయిక కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మేష రాశి:
సింహ రాశిలో ఈ గ్రహాల కలయిక కారణంగా మేష రాశివారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. దీంతో పాటు వీరికి సంపద, సంతోషం, శ్రేయస్సు కూడా పెరుగుతుంది. అలాగే కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోయి.. ఆనందం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే భాగస్వామ్య జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో విదేశాలకు వెళ్లేవారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో విదేశి పెట్టుబడులు పెట్టే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 



కన్యారాశి:
శుక్రుడి సంచారంతో కన్యా రాశివారికి వృత్తిపరమైన జీవితంలో అనేక మార్పులు వస్తాయి. అలాగే ఎంతో కష్టమైన పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి బాస్‌ సపోర్ట్ లభించి అనుకున్న పనులు కూడా సులభంగా చేస్తారు. అంతేకాకుండా వివాహాలు కానీ వారికి ఈ సమయంలో మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. అంతేకాకుండా వివాహాలు నిశ్చయమయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


తులారాశి:
తులా రాశివారికి ఈ సమయం చాలా సానుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా జీవితం కూడా చాలా ఆనందంగా గడుస్తుంది. కొత్త ఉద్యోగాల్లో జాయిన్‌ అయ్యేవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అనుకున్న పనులన్నీ సులభంగా చేస్తారు. అలాగే ఆర్థికంగా కూడా బోలెడు లాభాలు పొందుతారు. వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా డబ్బు కూడా బాగా సంపాదిస్తారు. దీంతో పాటు విపరీతమైన ఆదాయ వనరులు కూడా పుట్టుకు వస్తాయి. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి