శ్రావణం ప్రారంభం, ఈ నెలలో మంచి ముహూర్తాలు ఇవే
Sravana Masam: ఆషాడం ముగిసింది. పవిత్రంగా భావించే శ్రావణం ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఇక నుంచి ముహూర్తాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు ఊపందుకుంటాయి. రానున్న రోజుల్లో మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడున్నాయనేది పరిశీలిద్దాం.
Sravana Masam: ఆషాడం ముగిసింది. పవిత్రంగా భావించే శ్రావణం ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఇక నుంచి ముహూర్తాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు ఊపందుకుంటాయి. రానున్న రోజుల్లో మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడున్నాయనేది పరిశీలిద్దాం.
హిందూవులకు అత్యంత పవిత్రమైనది శ్రావణమాసం(Sravana masam). ఆషాడం(Ashadam) ముగిసి..ఇవాళ్టి నుంచి శ్రావణం ప్రారంభమైంది. శ్రావణ మాసంలో మహిళలు నోములు నోచుకుంటుంటారు. అటు కోయిలమ్మ రాగాలతో స్వాగతం పలికేది ఈ మాసంలోనే. నోములకు, పేరంటాలకు ఈ నెల సుప్రసిద్ధి. విశేషమైన పూజలు, పునస్కారాలు ఈ నెలలోనే జరుగుతుంటాయి. వరలక్ష్మీ వ్రతాలుంటాయి. అందుకే పెళ్లిళ్లు, శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు అన్నీ ఉంటాయి. ప్రధానమైన పండుగలు కూడా ఈ నెల నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన శ్రావణమాసంలో అసలు మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడున్నాయనేది ఓసారి పరిశీలిద్దాం.
ఈ నెల 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 7 వ తేదీ వరకూ శ్రావణమాసం(Sravana masam)కొనసాగుతుంది. ఈ నెల 12, 13 తేదీల్లో నాగుల చవితి, గరుడ పంచమిలతో ప్రధాన పండుగలు ప్రారంభం కానున్నాయి. 14వ తేదీన లక్ష్మీ వెంకటేశ్వర వ్రతం, 15న నరసింహ వ్రతం, 20వ తేదీన వరలక్ష్మీ వ్రతం, 23న శ్రావణ పౌర్ణిమ, రాఖీ పర్వదినం(Rakhi festival) ఇలా మొదలు కానున్నాయి. ఈ నెల 30వ తేదీిన కృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 6న అమావాస్యతో శ్రావణం ముగిసి భాద్రపదం ప్రవేశిస్తుంది. ఈ నెల 11, 13, 15, 18, 20, 22, 25, 27, 31 , సెప్టెంబర్ 1, 4, 5 తేదీల్లో బలమైన ముహూర్తాలున్నాయని(Auspicious Dates) పండితులు చెబుతున్నారు.
Also read: Shirdi Sai Baba madhyana aarati Telugu lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook