Morning Auspicious Things: మనం చేసే పనులను బట్టి ఫలాలను ఇస్తాడు శనిదేవుడు. అందుకే అతడిని న్యాయదేవత అంటారు. ప్రతి ఒక్కరూ శనిదేవుడి అనుగ్రహం తమపై ఉండాలనుకుంటారు. అందుకోసం శనివారం శనిదేవుడిని పూజిస్తారు. అదే విధంగా శనివారం నాడు ఉదయం వీటిలో దేనినైనా చూస్తే.. శనిదేవుడి (Shanidev) కటాక్షం మీకు లభిస్తుంది. మీరు బాధల నుండి విముక్తి పొంది.. అపారమైన డబ్బును సంపాదిస్తారు. అవేంటో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిచ్చగాడ్ని చూడటం- శనివారం ఉదయం మీ ఇంటికి  బిచ్చగాడు వచ్చినా లేదా కనిపించినా అది శుభసూచకంగా భావిస్తారు. ఆ సమయంలో మీరు అతడికి సహాయం చేసినట్లయితే శనిదేవుడు సంతోషించి మీ కోరికలను నెరవేరుస్తాడు. 


స్వీపర్- శనివారం ఇంటి దగ్గర స్వీపర్ కనిపించడం కూడా శుభ సూచకమే. ఆరోజు అతనికి డబ్బు ఇవ్వడం లేదా సహాయం చేయడం వల్ల శనిదేవుడి కృప మీపై ఉంటుంది. దీంతో మీ సంపద పెరుగుతుంది. మీ కెరీర్ లో పురోగతి సాధిస్తారు.  


నల్ల కుక్క కనిపిస్తే - జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శనివారం నల్ల కుక్క కనిపించడం మంచి శకునంగా భావిస్తారు. కుక్కలకు ఆహారం పెడితే వారి పట్ల శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతారు. శనివారం శని ఆలయం వెలుపల నల్ల కుక్క కనిపిస్తే మీరు తప్పనిసరిగా రోటీ తినిపించండి. దీని వల్ల మీరు ప్రయోజనం పొందుతారు.  


నల్ల కాకి- శనివారం నాడు మీ ఇంట్లో నల్ల కాకి నీరు తాగినట్లు కనిపించినా లేదా కూర్చున్నా అది శుభప్రదంగా భావిస్తారు. ఈ సమయంలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. 


నల్ల ఆవు దర్శనం- శనివారం నాడు నల్ల ఆవు కనిపించడం కూడా శుభప్రదమే. ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళుతున్నప్పుడు నల్ల గోవు కనిపిస్తే.. మీరు ఖచ్చితంగా ఆ పనిలో విజయం సాధిస్తారు. 


Also Read: Vastu Tips: తాబేలు విగ్రహం మీ ఇంట్లో ఉందా.. అయితే మీ ఇంట డబ్బే డబ్బు! ఏ దిశలో ఉంచాలో తెలుసుకోండి



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook