Ayodhya Rammandir: అయోధ్య రామాలయానికి బంగారం, వెండి చీపుర్లు, ఇవే ప్రత్యేకతలు
Ayodhya Rammandir: అయోధ్య రామాలయం ఇప్పుడు దేశమంతా ఓ హాట్ టాపిక్. మరి కొద్దిరోజుల్లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అత్యంత ఘనంగా జరగనున్న నేపధ్యంలో రామామందిరం గురించిన ప్రతి అంశం..ప్రతి విషయం వైరల్ అవుతున్నాయి. అటువంటిదే మరో కీలకమైన అప్డేట్ ఇది.
Ayodhya Rammandir: అయోధ్యలో జనవరి 22వ తేదీ రామమందిరం ప్రారంభం కానుంది. నూతన రామాలయంలో బాలరాముడు కొలువుదీరనున్నాడు. అందుకే అయోద్యలో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్నించి భక్తులు విశేషమైన కానుకలు పంపిస్తున్నారు. రాజస్థాన్ కోటా నుంచి బహుమానంగా వచ్చిన ఓ చీపురు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పవిత్రమైన అయోద్య రామాలయానికి చీపురు పంపించడమేంటి, ఆ చీపురు వైరల్ అవడమేంటని అనుకుంటున్నారా..ఇది సాధారణ చీపురు కాదు. కోటాకు చెందిన చీపుర్ల వ్యాపారి శ్రీరాముడికి బంగారం, వెండితో రెండు ప్రత్యేక చీపుర్లు తయారు చేయించాడు. ఈ చీపురు తయారీలో యమునా సాంప్రదాయం కన్పిస్తుంది. అయోధ్య బాలరాముడికి భక్తులు విభిన్న రూపాల్లో తమ భక్తిని ప్రదర్శించుకుంటున్నారు. అదే విధంగా రాహుల్ జైన్ అనే ఓ వ్యాపారి తనదైన శైలిలో రామమందిరం శుభ్రం చేసేందుకు రెండు ప్రత్యేకమైన చీపుర్లు తయారు చేయించాడు. ఇవి బంగారం, వెండితో చేసినవి కావడం విశేషం.
ముందు రాహుల్ జైన్ అయోధ్య రామాలయంలోని నాథ్ ద్వార మందిరం కోసం వెండి చీపురు తయారు చేశాడు. దేశమంతా రామమయం కావడంతో ఆ రాముని ఏదైనా ప్రత్యేక కానుక ఇవ్వాలనే ఆలోచనలో వెండి చీపురు తయారు చేశానన్నాడు. బంగారు చీపురు స్ట్రాంగ్‌నెస్ కోసం అష్ఠధాతు రాగి, ఇత్తడి సహా ఇతర ధాతువుల్ని ఉపయోగించాడు. ప్రధానంగా బంగారం ఎక్కువగా ఉపయోగించాడు. బంగారం, వెండి చీపుర్లు రెండింటి పొడవు 40 ఇంచెస్. దీనిని 10 రోజుల్లో తయారు చేశారు. చీపురు ఇమిడ్చే పైప్ పొడవు 18 ఇంచెస్. పైపును అందంగా కన్పించేలా డిజైన్స్ చెక్కించాడు.
ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన చీపురుగా ప్రసిద్ధికెక్కుతోంది. అయోధ్య రాముడికి కానుకగా పంపించనున్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ బంగారు చీపురుని తయారు చేసిన నిపుణుడి పేరు అల్తాఫ్ హుస్సేన్ కాగా వెండి చీపురు చేసినవాళ్ల పేర్లు తయ్యబ్, జుబేర్ కావడం గమనార్హం.
Also read: Ayodhya Rammandir: అయోధ్య రామమందిరం మోడల్ 34 ఏళ్ల క్రితమే తయారైందని తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook