Basant Panchami 2023,Puja Mantra: వసంత పంచమి పండుగను జనవరి 26న జరుపుకోనున్నారు. ఈరోజున విద్య, జ్ఞానం మరియు కళల దేవత అయిన సరస్వతిని పూజిస్తారు. వసంతం రాక కూడా ఈ రోజు నుండే ప్రారంభం అవుతుంది. పురాణాల ప్రకారం, సరస్వతీ దేవి మాఘమాసంలోని శుక్లపక్షం ఐదవ రోజున భూమిపై అవతరించింది. ఈ సంవత్సరం మాఘ శుక్ల పంచమి తిథి జనవరి 25వ తేదీ మధ్యాహ్నం 12:34 గంటలకు ప్రారంభమై జనవరి 26వ తేదీ ఉదయం 10:28 గంటలకు పంచమి తిథి ముగుస్తుంది. అందుచేత ఉదయతిథి ప్రకారం జనవరి 26న వసంత పంచమిని జరుపుకుంటారు. వసంత పంచమి రోజున ప్రజలు పూజలు, పారాయణం చేస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మంత్రాలను పఠించండి


ఉద్యోగ-ప్రమోషన్ కోసం: ఓం వద్ వద్ వాగ్వాదిని స్వాహా.
జ్ఞానం పొందడానికి: ఓం ఐం వాగ్దేవ్యై విఝే ధీమహి. తన్నో దేవి ప్రచోదయాత్.
పరీక్షలో విజయం కోసం: ఓం ఏక్దంత్ మహాబుద్ధి, సర్వ సౌభాగ్య దేయక్, సర్వసిద్దికర గౌరీ వినాయక అనే మంత్రాలను జపించండి
జ్ఞానం పొందడానికి: ఓం ఐం సరస్వత్యై నమః


సరస్వతి పూజా విధానం
వసంత పంచమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. ముందుగా గణపతిని పూజించండి. అనంతరం సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయండి. అంతేకాకుండా మీ పుస్తకాలు, సంగీత వాయిద్యాలు లేదా సృజనాత్మక కళా సామాగ్రిని తల్లి దగ్గర పెట్టండి. అంతేకాకుండా నైవేద్యాన్ని పెట్టండి. చివరగా సరస్వతీదేవికి హారతి ఇచ్చి పూజను ముగించండి. 


Also Read: Shani Dev Transit 2023: కుంభరాశిలో వెండిపాదాలపై నడుస్తున్న శనిదేవుడు.. ఈ రాశులకు తిరుగులేనంత ధనం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి