Basant Panchami Upay: విద్యార్థులు చదువులో రాణించాలంటే.. వసంత పంచమి నాడు ఇలా చేయండి
Basant Panchami: మాఘ మాసం శుక్లపక్షం ఐదో రోజున వసంత పంచమి ఫెస్టివల్ ను జరుపుకుంటారు. ఈరోజున తీసుకునే కొన్ని చర్యల వల్ల సరస్వతిదేవి అనుగ్రహం లభిస్తుంది.
Student Remedies For Basant Panchami: ప్రతి సంవత్సరం మాఘమాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున వసంత పంచమి పండుగను జరుపుకుంటారు. జ్ఞానం, వాక్కు మరియు అభ్యాసానికి దేవత అయిన సరస్వతి తల్లి ఈ రోజున జన్మించిందని చెబుతారు. ఈ ఏడాది జనవరి 26న వసంత పంచమి పండుగను జరుపుకుంటున్నారు. ఈరోజున సరస్వతీమాతను పూజించడం మరియు కొన్ని చర్యలు చేయడం వల్ల ఆ తల్లి ఆశీస్సులు లభిస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు.
వసంత పంచమి రోజున ఈ చర్యలు చేయండి
** జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇంట్లో వాస్తు దోషాల వల్ల చాలా సార్లు విద్యార్ధులు చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. పరీక్షల్లో మంచి మార్కులు సాధించలేరు. వసంత పంచమి రోజున తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో కూర్చుని చదువుకోవడం వల్ల మీరు చదువులో రాణిస్తారు.
** వసంత పంచమి నాడు విద్యార్థులు తెలుపు, పసుపు రంగు దుస్తులు ధరించాలి. అలాగే శ్రీ గణేశుడు మరియు సరస్వతి తల్లి విగ్రహాన్ని ఈశాన్యంలో ప్రతిష్టించి పూజించండి. ఈ సమయంలో పసుపు రంగు పూలు, స్వీట్లు లేదా ఖీర్ తప్పనిసరిగా సమర్పించండి.
** విద్యార్థులు ఈ రోజు సరస్వతి తల్లికి కుంకుమ లేదా పసుపు చందనం తిలకం పెట్టండి. ప్రార్థనా స్థలంలో పుస్తకం మరియు పెన్ ఉండేలా చూసుకోండి. దీంతో సరస్వతీ మాత ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయి.
** చదువులో ఆటంకాలు ఎదురయ్యే వారు లేదా ఏకాగ్రతతో చదువుకోలేని వారు వసంత పంచమి రోజున 'ఓం సరస్వత్యై నమః' అనే మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి. శుభ్రమైన భంగిమలో కూర్చొని పఠించండి. తూర్పు లేదా ఉత్తరం వైపు మాత్రమే మంత్రాన్ని జపించండి.
Also Read: RajYog: త్వరలో అరుదైన రాజయోగం.. ఈ రాశులకు ఊహించనంత ధనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook