Best Vastu Tips: భారతదేశంలో చాలామంది వాస్తును బలంగా నమ్ముతారు. ఇంట్లో ప్రవేశిస్తూనే చికాకు-మనశ్సాంతి లేకపోయినా..ప్రతి చిన్న తప్పును ఇతరులు సహించలేకపోవడం..ఇవన్నీ వాస్తు లోపాలే అంటారు సిద్ధాంతులు. మరేం చేయాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తుశాస్త్రంలో జీవితానికి సంబంధించి దాదాపు ప్రతి సమస్యకు పరిష్కారముంటుందని వాస్తు పండితులు చెబుతారు. ఇందులో నెగెటివ్ ఎనర్జీని దూరం చేసే ఉపాయాలు కూడా ఉన్నాయిట. మీ జీవితంలో ఒకవేళ ఆర్ధికంగా ఇబ్బందులుంటే..ఆఫీసు నుంచి ఇంటికి రాగానే మీ మూడ్ పాడవుతుంటే..ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కొరత ఉందని అర్ధమంటున్నారు వాస్తు నిపుణులు. సాధారణంగా ఆర్ధికంగా ఇబ్బందులుంటేనే ఆందోళన అధికమౌతుంటుంది. ఇప్పుుడు మనం వాస్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన విషయాల్ని తెలుసుకుందాం..


వాస్తు నిపుణులు ఏమంటున్నారు


వాస్తులో మార్పులు చేయడం ద్వారా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలా మార్గం సుగమం చేయవచ్చు. వాస్తు శాస్త్రానికి అగ్ని, భూమి, వాయవు, జలం, ఏవం, ఆకాశం అనేవి ఆధారం. ఈ ఐదు పంచతత్వాలను వాస్తు శాస్త్రంలో పంచమహాభూతాలంటారు. పంచతత్వాలు బ్యాలెన్స్‌గా ఉంటే ఆ వ్యక్తి కూడా శాంతంగా ఉంటాడు. ఈ ఐదింటిలో ఏది లోపించినా సంబంధిత దేవత నుంచి ఆగ్రహంఎదుర్కోవల్సి వస్తుంది. పంచతత్వాలు సమృద్ధిగా ఉన్న ఇంట్లో సుఖ సంతోషాలు, ప్రశాంతత లభిస్తాయి.


ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ నాలుగు భుజాలుగానే ఉండాలి. దీనినే గుమ్మం అంటారు. దీని వల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించదు. సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం తెరిచినప్పుడు..ముందుగా గుమ్మంపై కాస్త నీళ్లు చల్లాలి. ఎందుకంటే రాత్రివేళల్లో అక్కడ నెగెటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే కొట్టుకుపోతాయి. ఇంట్లో ప్రవేశించజాలవు.


ఇంటి ఇల్లాలు ఇంటిని స్వయంగా శుబ్రపర్చినా లేదా మరొకరితో చేయించినా..ఇంటి ప్రధాన గుమ్మం దగ్గరు లోపలిభాగంలో ముగ్గు తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. లేదా ముగ్గుల వంటి టైల్స్ ఉన్నా ఫరవాలేదు. దీనివల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశించజాలదు. ప్రధాన గుమ్మంపై కాషాయరంగుతో 9 అంగుళాల స్వస్తిక్ గుర్తు అమర్చాలి. ప్రధాన గుమ్మానికి తోరణం తప్పకుండా ఉండాలి. ఈ తోరణం మామిడాకులతో ఉండాలి. ఇక పుడ్ ప్రిపేర్ చేసేముందు కిచెన్ శుభ్రం చేసుకోవాలి. మంత్రాలు పఠిస్తూ ఈశ్వరుడిని స్మరించాలి. మొదటి రొట్టెను ఆవులకు, చివరి రొట్టెను కుక్కలు లేదా పక్షుల కోసం కేటాయించాలి. 


Also read: Today Horoscope: ఇవాళ ఏప్రిల్ 30 సూర్యగ్రహణం..శని అమావాస్య, ఆ రాశులవారి పరిస్థితి ఏంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.