Bhadrapada Amavasya 2022: పితృ దోషం, కాలసర్ప దోషం నుండి బయటపడాలంటే భాద్రపద అమావాస్య నాడు ఇలా చేయండి!
Bhadrapada Amavasya 2022: మరో నాలుగు రోజుల్లో భాద్రపద అమావాస్య రానుంది. ఇది శనివారం నాడు వస్తుంది కాబట్టి దీనిని శని అమావాస్య లేదా శనిశ్చరి అమావాస్య అని కూడా అంటారు. భాద్రపద అమావాస్య నాడు స్నానం, దానానికి విశేష ప్రాధాన్యత ఉంది.
Bhadrapada Amavasya 2022 Snan Daan Muhuratm: భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అమావాస్యను భాద్రపద అమావాస్య లేదా భాదో అమావాస్య (Bhadrapada Amavasya 2022) అంటారు. ఈ రోజున దానధర్మాలు, పూజలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. పితృ దోషం, కాలసర్ప దోషం నుండి బయటపడాలంటే ఈ రోజున కొన్ని పరిహారాలు చేయండి. ఈ సంవత్సరం భాద్రపద అమావాస్య 2022 ఆగస్టు 27న వస్తుంది.
భాద్రపద అమావాస్య నాడే శివయోగం..
భాద్రపద మాసంలోని కృష్ణ పక్షంలోని అమావాస్య తేదీ ఆగస్టు 26 శుక్రవారం మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభమై... ఆగస్టు 27, శనివారం మధ్యాహ్నం 01:47 వరకు ఉంటుంది. ఉదయ తిథి ఆధారంగా, భాద్రపద అమావాస్య ఆగస్టు 27, శనివారం నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం భాద్రపద అమావాస్య నాడు ఎంతో శుభప్రదంగా భావించే శివయోగం ఏర్పడుతోంది. ఈ రోజున ఆగస్టు 28 మధ్యాహ్నం 02:06 వరకు శివయోగం ఉంటుంది. శివయోగంలో చేసే పూజలు రెట్టింపు ఫలితాలనిస్తాయి.
భాద్రపద అమావాస్యకు పరిహారాలు
>> పితృదోషం తొలగించే పరిహారం: భాద్రపద అమావాస్య రోజు పితృదోషం పోగొట్టుకోవడానికి మంచిరోజు. ఈ రోజున పుణ్యనదుల్లో కుశ గడ్డి కలిపిన నీటిలో తర్పణం వదలడం ద్వారా పితృదోషం తొలగించుకోవచ్చు, పూర్వీకుల ఆశీస్సులు పొందవచ్చు.
>> కాల సర్ప దోషాన్ని తొలగించే రెమెడీ: కాలసర్ప దోషం జీవితంలో అనేక దుఃఖాలను కలిగిస్తుంది. జాతకంలో ఈ దోషం ఉన్నవారు కెరీర్ లో ముందుకెళ్లలేరు. భాద్రపద అమావాస్య రోజున శివాలయంలో వెండి సర్పాలు సమర్పించడం ద్వారా ఈ దోషాన్ని పోగొట్టుకోవచ్చు.
Also Read: Shani Margi 2022: అక్టోబరు 23 నుంచి శనిమహాదశ నుండి ఈ రాశులకు విముక్తి, ఈ రాశులకు భారీగా డబ్బు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook