Bhadrapada Amavasya 2022: భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం పదిహేనవ రోజున భాద్రపద అమావాస్య వస్తుంది. ఈ రోజున నదులలో స్నానం చేసి దానాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఈ సారి ఈ అమావాస్య (Bhadrapada Amavasya 2022) శనివారం వస్తుంది. అందుకే దీనిని శని అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున శనిదేవుడిని, పూర్వీకులను పూజించడం శుభప్రదంగా భావిస్తారు.  ఈ రోజున శనిదేవుడిని ఆరాధించడం వల్ల శని దోషం నుండి విముక్తి లభిస్తుంది. భాద్రపద అమావాస్య తిథి, ముహూర్తం, యోగం మొదలైన వాటి గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భాద్రపద అమావాస్య 2022 తేదీ
ఈ సారి భాద్రపద అమావాస్య ఆగస్టు 26, శుక్రవారం మధ్యాహ్నం 12.23 గంటలకు ప్రారంభమై... ఆగస్టు 27, శనివారం మధ్యాహ్నం 01:46 గంటల వరకు ఉంటుంది. ఉదయతిథి ఆధారంగా, భాద్రపద అమావాస్య ఆగస్టు 27, శనివారం నాడు జరుపుకోనున్నారు. ఈ రోజున రావిచెట్టును పూజించడం వలన మీ పితృదేవతలు,శని దేవుడు ఇద్దరూ సంతోషిస్తారు.  


శివయోగంలో భాద్రపద అమావాస్య
భాద్రపద అమావాస్య రోజున శివయోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఆగస్టు 27వ తేదీ తెల్లవారుజాము నుండి ఆగష్టు 28వ తేదీ తెల్లవారుజామున 02:07 వరకు శివయోగం ఉంటుంది. ఈ యోగంలో చేసే పని శుభ ఫలితాలను ఇస్తుంది. ఈరోజు అభిజీత్ లేదా శుభ ముహూర్తం ఉదయం 11.57 నుండి మధ్యాహ్నం 12.48 వరకు. ఈ రోజు రాహుకాలం ఉదయం 09:09 నుండి ఉదయం 10:46 వరకు ఉంటుంది.


భాద్రపద అమావాస్య ప్రాముఖ్యత
1. భాద్రపద అమావాస్య రోజున స్నానం చేసి దానం చేస్తే పుణ్యం కలుగుతుంది.
2. భాద్రపద అమావాస్యనాడు పూర్వీకులను పూజించడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు. ఈ రోజున ఉదయం 11.30 గంటల నుండి శ్రాద్ధ కర్మ, పిండ దానం మొదలైనవి చేయాలి.
3. భాద్రపద అమావాస్య నాడు స్నానమాచరించి పూర్వీకులకు తృప్తి కలిగేలా నల్ల నువ్వులు, అక్షతలు, పుష్పాలతో తర్పణం సమర్పించాలి.
4. భాద్రపద అమావాస్య నాడు శని అమావాస్య కూడా వస్తుంది. ఈ రోజున నల్ల ఉసిరి, నల్ల నువ్వులు, ఆవనూనె మొదలైన వాటిని దానం చేయడం ద్వారా శని దోషం తొలగిపోతుంది.
5. కాల సర్ప దోషం, పితృదోషాల నుండి బయటపడాలంటే..  భాద్రపద అమావాస్య నాడు కొన్ని పరిహారాలు చేయండి.


Also Read: Janmashtami 2022: రేపు శ్రీ కృష్ణ జన్మాష్టమి..శుభ ముహూర్తం, పూజ విధానం తెలుసుకోండి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook