Lohri 2023 Exact Date: మరో రెండు రోజుల్లో భోగి రానుంది. దీని కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. మన తెలుగు లోగిళ్లలో ఈ ఫెస్టివల్ ను చాలా వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగను సిక్కులు, పంజాబీలు లోహ్రీ అనే పేరుతో జరుపుకుంటారు. వీరు పండుగ నాడు సాంప్రదాయ దుస్తులు ధరించి గోధుమ బొబ్బలు, వేరుశెనగలు, బెల్లం, నువ్వులు మొదలైన వాటిని అగ్నిలో వేసి దాని చుట్టూ పాటలు పాడుతూ భాంగ్రా, గిద్దా నాట్యం చేస్తారు. ప్రతి ఏటా ఈ పండుగను జనవరి 13న జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది లోహ్రీ ఎప్పుడు జరుపుకునే విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంది. మరి ఈ పండుగ యెుక్క ఖచ్చితమైన తేదీ గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోహ్రీ జనవరి 13 లేదా 14?
లోహ్రీ పండుగను మకర సంక్రాంతికి ఒక రోజు ముందు జరుపుకుంటారు. ఈ సంవత్సరం మకర సంక్రాంతి పండుగ జనవరి 15న మరియు లోహ్రీ జనవరి 14, 2023న జరుపుకుంటారు. జనవరి 14వ తేదీ 08:57 గంటలకు ఆరాధనకు అనుకూలంగా ఉంటుంది.


లోహ్రీ పండుగ ప్రాముఖ్యత
లోహ్రీ పండుగ పంటలతో ముడిపడి ఉంటుంది. అందుకే లోహ్రీని రైతుల యెుక్క పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ గురించి పురాణాల్లో కూడా ఉంది. ఈరోజున పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు. ప్రజలందరూ దాని చుట్టూ గుమిగూడి అందులో కొన్ని వస్తువులను వేసి డ్యాన్స్ చేస్తారు. అదే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే భోగి మంటలు వేసి దానిలో పాత వస్తువులను వేసి తగులబెడతారు. అంతేకాకుండాఈ రోజున చిన్న పిల్లలపై భోగి పళ్లు వేసి ముత్తాయిదువులకు తాంబూలం ఇస్తారు. గాలిపటాలను కూడా ఎగురవేస్తారు. 


Also Read: Trigrahi Yog 2023: మకరరాశిలో అరుదైన త్రిగ్రాహి యోగం.. ఈ రాశులపై డబ్బు వర్షం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి