Budh-Shukra Yuti 2023: అరుదైన యోగాన్ని చేయబోతున్న బుధుడు-శుక్రుడు.. ప్రత్యేక ప్రయోజనం పొందబోతున్న రాశులివే..
Astrology; ఈ నెలలో బుధుడు, శుక్రుడు కలయిక జరగనుంది. వీరిద్దరి సంయోగం వల్ల పవిత్రమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. దీని వల్ల కొన్ని రాశులవారు స్పెషల్ బెనిఫిట్స్ పొందబోతున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Budh-Shukra Yuti 2023: ప్రతి గ్రహం పర్టికలర్ టైం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తోంది. మే నెల స్టార్ట్ అయింది. ఈ నెలలో కొన్ని గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. మే 2న శుక్రుడు మిథునరాశిలో సంచరించనున్నాడు. ఇదే సమయంలో శుక్రుడితో కలిసి లక్ష్మీనారాయణ రాజయోగాన్ని చేయనున్నాడు. ఈ యోగాన్ని ఆస్ట్రాలజీలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. బుధుడు, శుక్రుడు సంయోగం వల్ల కొన్ని రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
వృషభం
శుక్రుడు మరియు బుధుడు కలయిక వల్ల ఏర్పడిన లక్ష్మీనారాయణ రాజయోగం వృషభరాశి వారికి మేలు చేస్తుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీరు విజయం సాధిస్తారు. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు భారీ ప్యాకేజీతో జాబ్ వస్తుంది.
మిధునరాశి
మిథునరాశి వారికి లక్ష్మీనారాయణ యోగం కెరీర్‌లో అవకాశాలను ఇస్తుంది. మీ లవ్ బలపడుతుంది. మీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది. విద్యార్థులు ఈ సమయంలో రాణిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు బాగుంటుంది.
Also Read: Lucky Zodiac: మే నెలలో ఈ రాశులవారే అదృష్టవంతులు.. ఇందులో మీరున్నారా?
కన్య రాశి
లక్ష్మీనారాయణ యోగం కన్యారాశి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపనుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది, ఈ సమయంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీ పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.
Also Read: Budh uday 2023: మేషరాశిలో ఉదయించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులు పట్టిందల్లా బంగారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook