Budh Gochar 2023: జనవరి 13న ఉదయించబోతున్న బుధదేవుడు.. ఈ 3 రాశుల వారికి కష్టాలే కష్టాలు..
Budh Gochar 2023: బుధదేవుడు జనవరి 2న ధనుస్సు రాశిలో అస్తమించి.. జనవరి 13న ఉదయించనున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి కష్టాలు పెరగనున్నాయి.
Budh Gochar 2023: ఈ నెలలో అనేక గ్రహాలు తమ స్థానాలను మార్చనున్నాయి. అందులో ఒకటి గ్రహాల యువరాజైన బుధుడు. జనవరి 13న బుధదేవుడు ధనుస్సు రాశిలో ఉదయించబోతున్నాడు. బుధుడు జనవరి 2, 2023 నుండి ధనుస్సు రాశిలో ఉన్నాడు. జనవరి 13న మెర్క్యూరీ ధనుస్సు రాశిలో ఉదయించనున్నాడు. దీని కారణంగా కొందరికి కష్టాలు పెరగనున్నాయి. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
వృషభం (Taurus): ఈ రాశి యెుక్క రెండవ మరియు ఐదో ఇంటికి బుధుడు అధిపతి. వీరి జాతకంలో 8వ ఇంట్లో బుధుడు ఉదయించనున్నాడు. లావాదేవీలు జరిపేటప్పుడు మీరు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకుంటే మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
కర్కాటకం (Cancer): కర్కాటక రాశివారి జాతకంలో ఆరవ ఇంట్లో బుధుడు ఉదయిస్తాడు. దీంతో కర్కాటక రాశి వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. మీ బడ్జెట్ క్షీణించే అవకాశం ఉంది.
తులారాశి (Libra): ఈ రాశి వారికి బుధుడు తొమ్మిదవ మరియు పన్నెండవ గృహాలకు అధిపతి. మీ జాతకంలోని మూడవ ఇంట్లో బుధుడు ఉదయించనున్నాడు. ఆఫీసులో ఈ సమయం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. తుల రాశి వారికి ఈ సమయం అంతగా కలిసి రాదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.