Budh Gochar December 2022: జ్ఞానాన్ని ఇచ్చే బుధుడు మరో ఐదు రోజుల్లో తన రాశిని మార్చి మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 28న తెల్లవారుజామున 4.05 గంటలకు బుధుడు మకరరాశిలోకి వెళ్లనున్నాడు. మెర్క్యూరీ సంచారం (Mercury transit 2022) మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తాయి. కేప్రికాన్ లో మెర్క్యూరీ సంచారం వల్ల ఏ రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries); బుధుడి రాశిమార్పు మేష రాశివారికి చాలా మేలు చేస్తుంది. ఆర్థికంగా మీరు లాభపడతారు. మెర్క్యూరీ సంచారం వల్ల ఆఫీసులో మీరు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. ఫ్యామిలీ సపోర్టుతో మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 


వృషభం (Taurus): బుధుడి సంచారం ఈ రాశి యెుక్క జాతకంలో తొమ్మిదో ఇంట్లో ఏర్పడుతుంది. ఇది వృషభరాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ధార్మిక విషయాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ మద్దతు లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు రాణిస్తారు. 


కర్కాటకం (Cancer): ఈ రాశి యొక్క జాతకంలోని సప్తమ స్థానంలో బుధుడు సంచరించనున్నాడు. వ్యాపారస్తులకు ఈ సమయం బాగుంటుంది. వీరి బిజినెస్ వృద్ధి చెందడంతోపాటు భారీగా లాభాలను ఆర్జిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. 


కన్యారాశి (Virgo): మెర్క్యురీ సంచారం వల్ల మీరు వృత్తిలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునేవారికి ఇదే మంచి సమయం. ఆఫీసులో మీ పట్ల సానుకూలత ఉంటుంది. ఈరాశివారికి సహోద్యోగులు మరియు అధికారుల పూర్తి సహకారం లభిస్తుంది. 


Also Read: Grah Gochar: 2023లో 4 ప్రధాన గ్రహాల గమనంలో పెను మార్పు.. ఏ రాశులకు లాభమో తెలుసుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.