Budh Gochar 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధుడిని గ్రహాల రాకుమారుడు అంటారు. ఇవాళ అంటే నవంబర్ 13వ తేదీ రాత్రి 9.13 గంటలకు బుధుడు వృశ్చికరాశిలో (Mercury transit in Scorpio 2022) సంచరించబోతున్నాడు. బుధ గ్రహం యొక్క ఈ రాశి మార్పు వృశ్చికరాశితో పాటు అనేక రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరి జాతకంలో బుధుడు బలంగా ఉంటాడో వారు అపారమైన ప్రయోజనాలను పొందుతారు. బుధుడి సంచారం వల్ల ఏరాశులవారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం (Cancer): కర్కాటక రాశిలోని ఐదో ఇంట్లో బుధగ్రహ సంచారం జరగబోతోంది. బుధ సంచారం వల్ల వీరి కెరీర్ దూసుకుపోతుంది. ధనలాభం ఉంటుంది. మీరు శుభవార్త వింటారు. జీవితంలో సౌఖ్యాలు పెరుగుతాయి. వ్యాపారులు భారీగా లాభపడతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
వృశ్చిక రాశి (Scorpio): వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో చాలా లాభాలను పొందుతారు. మీరు వ్యాపారానికి సంబంధించి విహారయాత్రకు వెళ్లవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది.  
మీనరాశి (Pisces): మీన రాశి వారికి బుధుని ఈ రాశి మార్పు ముఖ్యంగా శుభప్రదం కానుంది. ఈరాశివారికి అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయం  సాధిస్తారు. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ పొందే అవకాశం  ఉంది. బిజినెస్ విస్తరిస్తుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. 
కన్య (Virgo): కన్యారాశి వారికి వృశ్చికరాశిలో బుధుని ప్రవేశం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బుధ సంచారం వల్ల ఈ రాశివారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆఫీసులో అనుకూల ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. డబ్బు లాభదాయకంగా ఉంటుంది.


Also Read: Surya Rashi Parivartan 2022: నవంబర్‌ 16న సూర్య గ్రహం సంచారం.. ఈ రాశువారు ఊహించని లాభాలు పొందుతారు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook