Mercury Transit In Taurus: వృషభరాశిలో బుధ సంచారం.. ఈ 4 రాశుల వారికి 68 రోజులపాటు డబ్బే డబ్బు!
Mercury Transit: ఈ రోజు బుధ గ్రహం వృషభరాశిలో ప్రవేశించింది. ఆ రాశిలోని 68 రోజులపాటు సంచరించనుంది. ఇది 4 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Mercury Transit In Taurus 2022: ఈ రోజు బుధుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించాడు. సాధారణంగా బుధుడు 21 రోజులపాటు సంచరిస్తాడు. కానీ ఈసారి అదే రాశిలో 68 రోజులు ఉండనున్నాడు. దీని ప్రభావం 12 రాశుల మీద పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వృషభరాశిలో బుధుడు ప్రవేశించడం (Mercury Transit In Taurus) 4 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. బుధుడు వారికి డబ్బు, వృత్తి, చదువు మొదలైన విషయాలలో చాలా ప్రయోజనాలను ఇస్తాడు. ఆ రాశులేంటే చూద్దాం.
మేషరాశి (Aries): బుధుని మార్పు మేష రాశి వారికి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. వారి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. పని మెరుగుపడుతుంది. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు.
వృషభం(Taurus): ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం వస్తుంది. వారు తమ కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. వ్యాపారస్తులు కూడా అధిక లాభాలు పొందుతారు. ఈ సమయం వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
మిథునం (Gemini): బుధ సంచారం మిథునరాశి వారి జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు ఇంటిని, కారును కొనుగోలు చేయవచ్చు. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది.
తుల రాశి (Libra): వృషభరాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల తుల రాశి వారికి పాత సమస్యలు తొలగిపోతాయి. వారి జీవితంలో దాదాపు అన్ని రంగాలలో మెరుగుదల ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆగిపోయిన పని సులభంగా చేయడం ప్రారంభమవుతుంది. మీరు ఇంటి కారును కొనుగోలు చేయవచ్చు.
Also Read: Horoscope Today April 23 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు 'రియల్ ఎస్టేట్'కు దూరంగా ఉంటే మంచిది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook