Budh Gochar 2023: మార్చి 31 నుంచి ఈ 3 రాశులకు కష్టాలే కష్టాలు.. ఇందులో మీ రాశి ఉందా?
Budh Gochar 2023: బుద్ది మరియు వ్యాపారాన్ని ఇచ్చే బుధుడు ఈ నెల చివరిలో మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. మేషంలో బుధ సంచారం వల్ల ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
Budh Gochar 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం, మార్చి 31, శుక్రవారం మధ్యాహ్నం 01.31 గంటలకు గ్రహాల రాకుమారుడైన బుధుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ప్రస్తుతం బుధుడు మీనరాశిలో కూర్చుని ఉన్నాడు. త్వరలో బుధుడు అశ్విని నక్షత్రంలో సంచరిస్తాడు. ఇది అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం శుక్రుడు మరియు రాహువు ఇప్పటికే మేషరాశిలో ఉన్నారు. ఈ మూడు గ్రహాల కూటమి ప్రభావం కొన్ని రాశులపై సానుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉండబోతుంది. మరోవైపు బుధ, శుక్ర గ్రహాల కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. మేషంలో బుధ సంచారం వల్ల ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
బుధ సంచారం ఈ రాశులకు కష్టకాలం
వృషభం
బుధ సంచారం వల్ల వృషభరాశి వారికి హాని కలుగుతుంది. మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కోంటారు. అంతేకాకుండా లావాదేవీలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోంటారు. సహోద్యోగులతో విభేదాలు తలెత్తుతాయి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
కన్య రాశి
బుధ గోచారం వల్ల కన్యా రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
మేషరాశిలో బుధుడు సంచారం వల్ల వృశ్చిక రాశి వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మీరు చిన్న పనికి కూడా బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మీరు రుణవిముక్తి పొందలేరు.
Also Read: Surya Mahadasha: మీ జాతకంలో సూర్య మహాదశ ఉందా? అయితే ఇక మిమ్మల్ని ఎవరూ ఆపలేరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook