Budh Grah Gochar 2023:  మెర్క్యురీని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడిగా బుధుడిని భావిస్తారు. ఎవరి జాతకంలో బుధుడు శుభ స్థానంలో ఉంటాడో వారు కెరీర్ అద్భుతంగా ఉంటుంది. రీసెంట్ గా బుధుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. దీంతో మేషంలో బుధుడు, శుక్రుడు మరియు రాహువు కలయిక ఏర్పడింది. బుధుడి యెుక్క ఈ గోచారం కొన్ని రాశులవారిపై శుభప్రభావం చూపనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. మేషరాశి: ఈ రాశిలోనే బుధ సంచారం జరిగింది కాబట్టి దాని ప్రభావం ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. మీ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకర్షిస్తారు. మీకు ధనలాభం కలుగుతుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని దక్కించుకుంటారు. జాబ్ లో ప్రమోషన్ వస్తుంది. 
2. కర్కాటకం: కర్కాటకరాశి వారికి బుధ గ్రహ సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ ఆరోగ్యం కాస్తా చెడిపోయే అవకాశం ఉంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అనుకున్న సమయానికి పనులను పూర్తి చేస్తారు. 
3. మకరం: మకర రాశి వారికి ఈ సమయం చాలా మంచిది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జాబ్ చేసేవారికి త్వరలోనే పదోన్నతి లభిస్తుంది. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. 


4. సింహం: మేషరాశిలో బుధుడు సంచరించడం వల్ల సింహరాశి వారిని అపారమైన సంపద లభ్యమవుతుంది. ఈ సమయం మీకు కలిసి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 
5. కుంభం: బుధుడు రాశి మార్పు కుంభ రాశి వారికి బాగుంటుంది. ఈ సమయం పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు శుభవార్త వింటారు. మీకు లక్ కలిసి వస్తుంది. 


Also Read: Chaturgrahi Yog: మేషరాశిలో చతుర్గ్రాహి యోగం.. ఈ 3 రాశులపై కనక వర్షం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook