Mercury Planet Transit In Kumbh 2023: జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజు, ఫ్లానెట్స్ ఫ్రిన్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇతడిని వ్యాపారం, తెలివితేటలు మరియు సంపదకు కారకుడిగా భావిస్తారు. మెర్క్యూరీ యెుక్క కదలికలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. గత నెల 27న బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. అప్పటికే శని, సూర్యుడు అక్కడ తిష్ట వేశారు. దీని కారణంగా అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడింది. కుంభరాశిలో బుధ సంచారం ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధుడి సంచారం ఈ రాశులకు వరం
వృషభ రాశి
బుధుడు శని ఇంటికి వెళ్లడం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. బుధుడు మీ సంపద మరియు సంతానానికి అధిపతిగా భావిస్తారు. మీకు గౌరవంతోపాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మెర్క్యూరీ మీ కర్మస్థానంలో శనితోపాటు కూర్చున్నాడు. అంతేకాకుండా శనిదేవుడే స్వయంగా మీ జాతకంలో కేంద్ర త్రికోణ రాగయోగంలో కూర్చున్నాడు. దీంతో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. 
మిథునం
మెర్క్యురీ యొక్క సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు మీ యెుక్క అదృష్ట స్థానంలో కూర్చున్నాడు. దీంతో లక్ష్మీదేవి మీపై కనకవర్షం కురిపిస్తుంది. మీరు ఈ సమయంలో ఏదైనా శుభకార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. మీ కోరికలు నెరవేరుతాయి. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేశారు. శనిదేవుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి.
సింహ రాశి
సింహ రాశి వారికి మెర్క్యురీ సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మెర్క్యూరీ మీ జాతకంలోని ఏడవ ఇంట్లో కూర్చున్నాడు. శష్ రాజయోగం వల్ల మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. 


Also read: Three Rajyog effect: 617 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక.. ఈ రాశుల దశ తిరగడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.