Budh Gochar 2023: రాబోయే నెల రోజులు పాటు ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.. ఇందులో మీరున్నారా?
Mercury Transit 2023: గ్రహాల రాకుమారుడై బుధుడు ప్రస్తుతం మకరరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
Budh Gochar In Makar 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం దాని నిర్దిష్ట సమయంలో తన రాశిని ఛేంజ్ చేస్తుంది. నిన్న అంటే ఫిబ్రవరి 07న బుధుడు మకరరాశిలోకి ప్రవేశించాడు. మెర్క్యురీ కన్యారాశిలో ఉచ్చస్థితిలోనూ, మీనరాశిలో బలహీన స్థితిలోనూ ఉంటాడు. ఏదైనా గ్రహం యొక్క సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా మరియు ఇతరులకు అశుభకరంగా ఉంటుంది. బుధగ్రహ సంచారం వల్ల ఏ రాశి వారిపై ప్రతికూల ప్రభావం పడనుందో తెలుసుకుందాం.
మిధునరాశి
మకరరాశిలో బుధుడు సంచరించడం వల్ల మిథున రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మీ మాటలను అదుపులో పెట్టుకోండి, లేకపోతే కుటుంబం లేదా స్నేహితులతో గొడవలు పడే అవకాశం ఉంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ టైంలో పొరపాటున కూడా ఎవరినీ నమ్మవద్దు. వైవాహిక జీవితంలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
బుధగ్రహ సంచారం వల్ల కర్కాటక రాశి వారు ఆఫీసులో ఒత్తిడికి గురవుతారు. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ధన నష్టం ఉండవచ్చు. ఈ సమయంలో ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకండి, మీరు అప్పు తీసుకోకండి.
సింహం
బుధగ్రహ సంచారం వల్ల సింహ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. సోమరితనం విడిచిపెట్టడం మంచిది. పరిశోధన కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు కూడా ఈ సమయంలో ప్రయోజనం పొందుతారు.
మకరరాశి
బుధుడు మకరరాశిలో ప్రవేశించడం వల్ల ఈరాశి వారు అనేక కష్టాలను ఎదుర్కొంటారు. పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. మీరు మీ మాటలు అదుపులో పెట్టుకోకపోతే అనేక సమస్యలకు గురవుతారు. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగుతాయి.
Also Read: Mahashivratri 2023: మహాశివరాత్రి నాడు త్రిగ్రాహి యోగం... వీరు ధనవంతులవ్వడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook