COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Budh Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..మొత్తం 12 రాశుల జాతకం గ్రహాలు, నక్షత్రాల స్థానాల ఆధారంగా అంచనాలు వేస్తారు. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. గ్రహాల రాకుమారుడుగా పరిగణించే బుధుడు సాధారణంగా ఏ రాశిలోనైనా 27 రోజుల పాటు సంచారం దశలో ఉంటాడు. అయితే బుధుడు  అక్టోబర్ మొదటి తేదిన రాశి సంచారం చేయబోతున్నాడు. అక్టోబరు 1 రాత్రి 08:39 గంటలకు బుధుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో చాలా రకాల మార్పులు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  


బుధుడు నక్షత్రంలో కూడా మార్పులు:
బుధ గ్రహం అక్టోబర్‌లో రాశి సంచారంతో పాటు స్వాతి నక్షత్రంలోకి కూడా ప్రవేశించబోతున్నాడు. అయితే ఈ ప్రవేశం అక్టోబరు 07న జరగబోతోంది. ఆ తర్వాత బుధుడు అక్టోబర్‌ 31న మరోసారి విశాఖ నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. ఇలా చేయడం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


మిథునరాశి:
బుధుడి తిరోగమనం మిథునరాశివారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఈ సమయంలో ప్రాయణాలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో అన్ని రకాల సౌకర్యాలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు నిలిపోయిన డబ్బు కూడా తిరిగి పొందుతారు. ఇక ఉద్యోగాలు చేసేవారి పరిస్థితులు ఈ సమయంలో అనుకూలంగా మారుతాయి. దీంతో పాటు మీ పిల్లల మద్ధతు లభించి భూములతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    


కన్య రాశి:
బుధుడు తిరోగమనం కారణంగా ఈ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కోరుకున్న పనులు  కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి పనులైన సులభంగా విజయాలు సాధిస్తారు. బుధుడి అనుగ్రహంతో ఆర్థికంగా కూడా బలపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయంలో భారీ లాభాలు కలుగుతాయి. 


Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook