COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Budh Gochar 2023 Scorpio November: గ్రహాల రాకుమారుడైన బుధుడు 6 నవంబర్ సోమవారం సాయంత్రం 04:32 గంటలకు వృశ్చికరాశిలోకి సంచారం చేసింది. ఆ తర్వాత నవంబర్ 27న ఉదయం 06.02 గంటలకు ధనుస్సు రాశిలోకి  సంచారం చేయనుంది. ఈ గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో మేధస్సు, ఏకాగ్రత, వాక్కు, చురుకుదనానికి కారకంగా పరిగణిస్తారు. వృశ్చిక రాశిలో బుధుడు సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. రాబోవు 20 రోజులు ఏయే రాశుల వారి జీవితాల్లో ఆనందం రెట్టింపు అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


మకర రాశి:
బుధుడు రాశి సంచారం చేయడం వల్ల మకర రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో పురోగతి లభిస్తుంది. దీంతో పాటు కొత్త అవకాశాలు కూడా పొందే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇక వ్యాపారాలు చేసేవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో డబ్బులు ఆదా చేయడం వల్ల భవిష్యత్‌లో మంచి లాభాలు పొందుతారు. దీంతో పాటు పెట్టుబడులు పెట్టేవారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


కుంభం:
బుధుడి సంచారం కుంభ రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సంచారం కారణంగా కుంభ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీని కారణంగా ఎలాంటి పనుల్లోనైన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ప్రేమ జీవితం కూడా మరింత మెరుగుపడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థికంగా కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 


వృశ్చిక రాశి:
ఈ సమయం వృశ్చిక రాశివారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. వీరికి బుధుడు సంచారం చేయడం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది. దీంతో పాటు అదృష్టవశాత్తూ కొన్ని పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 


మేష రాశి: 
మిథునం, మీనం రాశుల వారు బుధుడి సంచార సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టడం కూడా మానుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే ఆర్థికంగా నష్టపోయే ఛాన్స్‌లు ఉన్నాయి. జర్నీ చేసే సమయాల్లో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook