Budh Rashi Parivartan 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు, ఫ్లానెట్స్ ఫ్రిన్స్ అని పిలుస్తారు. బుధ గ్రహం ఈరోజు అంటే మార్చి 16వ తేదీ ఉదయం 10.54 గంటలకు మీనరాశిలోకి ప్రవేశించనుంది. అదే రాశిలో మెర్క్యూరీ గ్రహాల రాజు సూర్యుడితో జతకట్టనున్నాడు. బుధుడు మార్చి 31 వరకు అదే రాశిలో ఉండనున్నాడు. మీనరాశిలో బుధ సంచారం వల్ల  5 రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధుడి సంచారం ఈ రాశులకు వరం


మీనరాశి
ఈ రాశిలోనే బుధుడి సంచారం జరగనుంది. దీని కారణంగా సమాజంలో మీ ప్రాబల్యం పెరుగుతుంది. మీ మాటలతో ప్రజలను ఆకట్టుకుంటారు. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీకు వివాహం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటారు. బిజినెస్ విస్తరిస్తుంది. 


కర్కాటక రాశి
బుధ గ్రహ రాశి మార్పు వల్ల మీరు ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. బిజినెస్ విస్తరించడానికి ఇదే మంచి సమయం. మీ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. 


మకరరాశి
బుధగ్రహ సంచారం కారణంగా మీరు ఉద్యోగ-వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీరు ఆఫీసులో కొత్త బాధ్యతను తీసుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ మధురమైన స్వరంతో ప్రజలు ఆకట్టుకుంటారు. మీరు కొత్త ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.


వృశ్చికరాశి
బుధుడి రాశి మార్పు వ్యాపారులు వృశ్చిక రాశి వారు అనేక ప్రయోజనాలను పొందుతారు. మీరు మీ బిజినెస్ ను విస్తరిస్తారు. ఏదైనా విలువైన వస్తువు లేదా భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు లవ్ ప్రపోజ్ చేయడానికి ఇదే మంచి సమయం.


వృషభం
వృషభరాశి వారు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు సామాజిక సేవలో ఆసక్తిని కనబరుస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది. 


Also Read: Meena sankranti 2023: మీన సంక్రాంతి అంటే ఏమిటి? శుభ సమయం మరియు ప్రాముఖ్యత తెలుసుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook