Budh Gochar 2023 in Mithun Rashi 2023: వేద జ్యోతిషశాస్త్రంలో సంపద, వ్యాపారం, తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ కు కారకుడిగా బుధుడిని భావిస్తారు. నిన్న అంటే జూన్ 24, 2023న మెర్క్యూరీ మిథునరాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. బుధ సంచారం ద్వారా ఏర్పడిన భద్ర రాజయోగం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం: బుధ సంచారం వల్ల ఏర్పడిన భద్ర రాజయోగం మిథునరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది. బ్యాంకింగ్, వాణిజ్యం, మీడియా రచనలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీరు విజయం సాధిస్తారు.


తుల రాశి: భద్ర రాజయోగం తులారాశి వారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం ఉంటుంది. మీకు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు ప్రయాణాలు చేయడం ద్వారా ప్రయోజనం పొందుతారు. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. 


Also Read: Mars transit 2023: జూలై 1 నుండి ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..


ధనుస్సు: బుధ సంచారం వల్ల ఏర్పడిన భద్ర రాజయోగం ధనుస్సు రాశి వారికి మేలు చేస్తుంది. వ్యాపారులు లాభపడతారు. మీ బిజినెస్ పెరుగుతుంది. మీరు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ పనులన్నీ అనుకున్న సమయానికి జరుగుతాయి. 


Also Read: Jupiter transit 2023: రాబోయే 11 నెలలపాటు ఈ 5 రాశులవారిపై డబ్బు వర్షం.. మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook