Mercury gochar 2024 Rashifal: గ్రహాల రాకుమారుడైన బుధుడు శని రాశి అయిన మకరరాశిలో సంచరించబోతున్నాడు. ఫిబ్రవరి  వనన01 గురువారం మధ్యాహ్నం 02:29 గంటలకు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. మెర్క్యూరీ ఫిబ్రవరి 20, మంగళవారం ఉదయం 06:07 వరకు మకరరాశిలో ఉంటాడు. మెర్క్యురీ యొక్క ఈ రాశి మార్పు నాలుగు రాశులవారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు: బుధుని రాశి మార్పు వల్ల మీ ఆదాయంలో తగ్గుదల ఉంటుంది. మీ వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీ ప్రమోషన్ మళ్లీ పెండింగ్ లో పడుతుంది. కెరీర్ లో అడ్డంకులు ఎదురవుతాయి. వ్యాపారులకు ఈ సమయం కలిసి రాదు. అప్పుల భారం పెరుగుతుంది. 


కుంభం: బుధుని సంచారం వల్ల మీ కెరీర్ లో అనేక సమస్యలు ఎదురవుతాయి. మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది తగిన సమయం కాదు. మీ వైవాహిక జీవితంలో గొడవలు వస్తాయి. మీ ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. 


మిథునరాశి: మకరరాశిలో బుధుడి సంచారం మిథునరాశి వారిపై చెడు ప్రభావం చూపనుంది. మీరు ఎంత కష్టపడినప్పటికి తగిన ప్రతిఫలం లభించదు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయి. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీ దాంపత్య జీవితంలో అనుకొని సమస్యలు తలెత్తుతాయి. మీరు అప్పుల ఊబిలో కూరుకుపోతారు.


కర్కాటకం: బుధుడు మకరరాశిలో ప్రవేశించడం వల్ల కర్కాటక రాశి వారు ఆర్థికంగా నష్టపోతారు. మీ ఇంట్లో దొంగతనం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ప్రయాణాలు మానుకుంటే మంచిది. వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. మీరు అనారోగ్యం బారినపడతారు. జాబ్ చేంజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం. 


Also Read: Mangal uday 2024: ధనుస్సు రాశిలో ఉదయించిన కుజుడు.. ఈ 3 రాశులకు లాభాలు బోలెడు..


Also Read: Sun transit 2024: శ్రవణ నక్షత్రంలో సూర్య సంచారం.. ఈ 4 రాశులవారికి పట్టనున్న అదృష్టం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter