Budh Gochar 2022: బుధుడు కన్యా రాశి ప్రవేశం, కొన్ని గంటల్లో మారనున్న ఈ రాశుల అదృష్టం!
Mercury Transit 2022: బుధుడిని గ్రహాల యువరాజుగా భావిస్తారు. ఇవాళ బుధగ్రహం ప్రస్తుతం ఉన్న సింహరాశిని మార్చి కన్యా రాశిలోకి ప్రవేశించింది. దీంతో ఈ రాశులవారు భవిష్యత్తు కొన్ని గంటల్లో మారిపోనుంది.
Budh Gochar 2022 Effect: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశి చక్రాన్ని మారుస్తుంది. ఈనెలలో చాలా గ్రహాలు తమ రాశిని మార్చనున్నాయి. ఇవాళ అంటే ఆగస్టు 21, ఆదివారం తెల్లవారుజామున 02:14 గంటలకు బుధ గ్రహం తన రాశిని మార్చి కన్యారాశిలోకి (Mercury Transit in Virgo 2022) ప్రవేశించింది. సెప్టెంబరు 25 వరకు కన్యారాశిలోనే ఉండనున్నాడు బుధుడు. దీని సంచార ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. మరి ముఖ్యంగా కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఈ సంచారం వల్ల ఏ రాశుల వారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
వృషభం (Taurus)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధుడు కన్యారాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. కొత్త జాబ్ వస్తుంది. లవ్ లైఫ్ బాగుంటుంది. ఈ సమయంలో మీ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.
మిథునం (Gemini)- బుధుడి రాశి మార్పు ఈ రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఏదైనా వ్యాపారం లేదా పనిని ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అదృష్టంతో మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారస్థులు అనేక విధాలుగా లాభపడతారు.
సింహ రాశి (Leo)- ఈ రాశివారికి పూర్వీకుల ఆస్తి వల్ల చాలా లాభం కలిసివస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులు లాభపడతారు. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది.
కన్య (Virgo) - బుధ గ్రహం ఈ రాశిలోనే సంచరించబోతోంది. అందువల్ల ఈ రాశివారు ప్రత్యేక ప్రయోజనం పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో భారీగా లాభపడతారు. వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. లైఫ్ పార్టనర్ సపోర్టు మీకు లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
Also Read: Budh Gochar 2022: కన్యా రాశిలోకి బుధుడు... రాబోయే 2 నెలలు ఈ రాశులకు డబ్బే డబ్బు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook