Budh Margi 2023: వేద జ్యోతిషశాస్త్రంలో బుధుడిని శుభ గ్రహంగా భావిస్తారు. బుధదేవుడిని గ్రహాల యువరాజు అని కూడా అంటారు. ఈ నెలలో మెర్క్యూరీ తిరోగమనం నుండి జనవరి 18, 2023 సాయంత్రం 6.18 గంటలకు ధనుస్సు రాశిలో మార్గంలోకి (Budh Margi 2023) రానుంది. బుధ సంచారం కొన్ని రాశులవారిపై అనుకూలంగానూ, మరికొందరిపై ప్రతికూలంగానూ ఉంటుంది. ధనుస్సు రాశిలో బుధుడి సంచారం వల్ల కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధుడి సంచారం ఈ రాశులకు ప్రతికూలం
వృషభం (Taurus): ఈ రాశి యెుక్క పంచమ మరియు రెండో ఇంటికి బుధుడు అధిపతి. వృషభరాశి వారి జాతకంలో బుధుడు సప్తమ స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. 
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి యెుక్క మూడవ మరియు పన్నెండవ ఇంటికి మెర్క్యూరీ అధిపతి. వీరి జాతకంలో బుధుడు ఆరవ ఇంట్లో సంచరించనున్నాడు. దీని కారణంగా వీరు మిశ్రమ ఫలితాలను పొంందుతారు. ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యాధి బారిన పడే అవకాశం ఉంది, దాని కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మకరరాశి (Capricorn): ఈ రాశి యెుక్క ఆరు మరియు తొమ్మిదవ ఇంటికి బుధదేవుడు అధిపతి. బుధుడు పన్నెండవ ఇంట్లో ఉంటాడు. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. మీ కెరీర్ లో అడ్డంకులు ఏర్పడతాయి. మీ తండ్రి ఆరోగ్యం చెడిపోయే అవకాసం ఉంది, కాబట్టి అప్రమత్తంగా ఉండటం అవసరం. 


Also Read: Mangal Margi 2023: వృషభరాశిలో కుజుడు ప్రత్యక్ష సంచారం... ఈరోజు నుంచి ఈరాశులకు తిరుగుండదు.. డబ్బే డబ్బు..!   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి