Bhadrapada First Pradosh Vratam 2022: భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి తిథి నాడు బుధ ప్రదోష వ్రతం జరుపుకుంటారు. ఇది ఈ ప్రదోష వ్రతం భాద్రపద మాసం మెుదటిది, ఆగస్టు మాసం చివరిది. ఈ వ్రతాన్ని ప్రతి నెల త్రయోదశి నాడు జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం పాటిస్తూ..శివుడిని పూజిస్తారు. భాద్రపద మాసంలో మొదటి ప్రదోష వ్రతం ఆగస్టు 24న జరుపుకోనున్నారు. ఇది బుధవారం వస్తుంది కాబట్టి దీనిని బుధ ప్రదోష వ్రతం (Budh Pradosh Vratam 2022) అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి. బుధ ప్రదోష వ్రతం తేదీ, శుభ ముహూర్తం గురించి తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుభ సమయం
పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి తిథి ఆగస్టు 24వ తేదీ ఉదయం 08:30 గంటలకు ప్రారంభమై... ఆగస్టు 25వ తేదీ ఉదయం 10.37 గంటల వరకు ఉంటుంది. ప్రదోష వ్రతాన్ని సాయంత్రం పూట జరుపుకుంటారు.  బుధ ప్రదోష వ్రతం యెుక్క పూజా సమయం సాయంత్రం 06.52 నుండి రాత్రి 09.04 వరకు ఉంటుంది. రాహుకాలం ఆ రోజు మధ్యాహ్నం 12.23 నుండి 02:00 వరకు. ఈ రోజున అమృత కాలం ఉదయం 10.57 నుండి మధ్యాహ్నం 12.45 వరకు. ఈ రోజు అభిజీత్ ముహూర్తం లేదు. 


ప్రదోష వ్రతం ప్రాముఖ్యత
ఈ వ్రతాన్ని  ఆచరించే వారు మహాదేవుడిని పూజిస్తారు. దీనిని జరుపుకోవడం వల్ల వ్యాధులు, గ్రహ దోషాలు, పాపాల నుండి విముక్తి లభిస్తుంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. శివుని అనుగ్రహం వల్ల మీ జీవితం బిందాస్ గా ఉంటుంది. 


శివపూజ
ప్రదోష వ్రతం రోజున సాయంత్రం వేళల్లో శివుని పూజిస్తారు. జనపనార, బిల్వ పత్రాలు, మందార పుష్పాలు, దాతుర, శమీ ఆకులు, అక్షత, చందనం, గంగాజలం, ఆవు పాలు మొదలైనవి ఆయనకు నైవేద్యంగా పెడతారు. ఆరాధన సమయంలో మీరు బుద్ధ ప్రదోష వ్రత కథ వినాలి లేదా చదవాలి. దీంతో వ్రతానికి సంబంధించిన పూర్తి ఫలం లభిస్తుంది.


Also Read: Krishna Janmashtami 2022: జన్మాష్టమి నాడు శుభయోగం... ఈ 4 రాశులకు లాభం..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook