Transit of Mercury Conjunction with Rahu 2023: బుధుడి సంచారం.. ఈ రాశుల వారి సీన్ మారిపోయింది.. ఏం జరగబోతోందో తెలుసా..?
Budh Rahu Yuti 2023: బుధుడు తన రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల పలు స్థానాల్లో రాహువుతో కలుసుకున్నాడు. కాబట్టి ఈ క్రమంలో చాలా రకాల లాభాలతో పాటు, దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Budh Rahu Yuti 2023: ప్రతి గ్రహం దాని అనుకూల సమయంలోనే సంచారం చేస్తుంది. ప్రతి నెలా కొన్ని గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకుని గ్రహాల్లో సంచారం చేస్తూ వస్తాయి. దీని కారణంగా ఆ గ్రహాలకు సంబంధించిన రాశి చక్రాల్లో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. అయితే మార్చి 31న బుధుడు మేషరాశిలో సంచారం చేయడం కారణంగా పలు రాశులవారి జీవితాల్లో చాలా రకాల మార్పులు జరిగే అవకాశాలున్నాయి. అయితే ఇదే రాశిలో మెర్క్యురీ ఉండడం వల్ల రెండు గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా చాలా రాశులవారి జీవితంలో మార్పులు సంభవించే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో ఈ గ్రహ సంచారం ఉంటే ఆర్థిక నష్టాలు, దుఃఖాలు, మానసిక ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో దుష్ప్రభావాలు కలిగే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏయే రాశులవారికి ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మిథునరాశి:
మిథునరాశికి 11వ స్థానంలో బుధుడు, రాహువు కలయిక వల్ల ఈ క్రమంలో ఆకస్మిక ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా సామాజిక, ఆర్థిక స్థితిగతులు ఆకస్మికంగా పెరుగుతాయి. ఈ తరుణంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా సామాజిక, వ్యాపార సంబంధాలను ఏర్పరచుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. ఈ రాశివారు మోసం, ఇతర దుష్ప్రభావాలు కూడా కలిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆలోచించి పనులు చేస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read: Surya Gochar 2023: వచ్చే నెల రోజులపాటు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?
సింహరాశి:
సింహరాశి వారికి బుధుడు 9వ స్థానంలో రాహువుతో కలిశాడు. దీంతో గురువు స్థానంలో మార్పలు సంభవించే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేయడం మానుకోవడం వల్ల దుష్ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు చేసేవారు కొత్త ఒప్పందాలు కూడా పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే ఈ క్రమంలో చాలా రకాల నష్టాలు కలుగొచ్చు.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి 5వ స్థానంలో ఈ సంచారం జరిగింది. కాబట్టి రచయితలు, తత్వవేత్తలకు చాలా రకాల ప్రయోజనాలు కలుగొచ్చు. జాతకంలో బుధుడు అశుభ స్థానంలో ఉంటే రచనలతో సంబంధం ఉన్న వ్యక్తులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా మానసిక అవరోధం కూడా అనుభవించవచ్చు. ఈ రాశివారు పిల్లల ఆరోగ్యం పట్ల పలు రకాల జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
మీనరాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధుడు ఈ రాశిలో రెండవ స్థానంలో రాహువుతో కలిశాడు. దీంతో ఈ రాశివారికి డబ్బులు ఆదా అవుతాయి. అంతేకాకుండా పలు సందర్భాల్లో ఖర్చులు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రహ సంచార ఎఫెక్ట్‌తో కుటుంబంతో కొన్ని వివాదాలు కలుగొచ్చు. కాబట్టి పలు రకాల జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Vande Bharat Express: వందేభారత్ రైళ్లలో కీలక మార్పు, త్వరలో స్లీపర్ కోచ్‌లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook