Budh Rashi Parivartan 2023 June: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్య కలిగి ఉంటుంది. ఈ గ్రహం సంచారం చేస్తే మొత్తం 12 రాశులవారిపై ప్రభావం పడుతుంది. ఈ గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో  మేధస్సు, వ్యాపారానికి, కమ్యూనికేషన్‌కు కారకంగా భావిస్తారు. అయితే బుధుడు జూన్ 07న మేషరాశిని వదిలి వృషభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహ సంచార ప్రభావం కొన్ని రాశులవారికి అనుకూలంగా జరిగితే మరికొన్ని రాశులవారికి సానుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే బుధ గ్రహ ప్రభావం ఏయే రాశులవారిపై పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై బుధ గ్రహ ప్రభావం:
మేషరాశి:

మేషరాశి వారికి బుధుడు తృతీయ, ఆరవ స్థానంలో అధిపతిగా వ్యహరించబోతున్నాడు. కాబట్టి ఈ రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే తీవ్రంగా నష్టపోతారు. అంతేకాకుండా వీరు ఎలాంటి పనులు చేసిన శ్రద్ధతో చేయాల్సి ఉంటుంది. 


Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్  


మిథునరాశి:
మిథునరాశికి బుధుడు నాల్గవ స్థానంలో అధిపతిగా వ్యవహరిస్తాడు. ఈ రాశివారికి బుధ సంచారం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఖర్చులు పెరగడం కారణంగా మానసిక ఒత్తిడి ఇతర సమస్యలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది.


కర్కాటక రాశి:
కర్కాటకరాశి వారికి బుధుడు తృతీయ, 12వ స్థానంలో అధిపతిగా వ్యవహరించబోతున్నాడు. వృషభరాశిలో బుధుడు సంచారం చేయడం వల్ల కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. 


సింహం:
సింహ రాశి వారికి బుధుడు 11వ స్థానంలో అధిపతిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సంచారం ప్రభావం వల్ల రాశివారికి తీవ్ర నష్టాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి నష్టాలు కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. 


Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి