Mercury in Capricorn 2023: జ్యోతిషశాస్త్రంలో అత్యంత వేగవంతమైన గ్రహాలలో మెర్క్యురీ ఒకటి. ఎవరి జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటాడో వారికీ దేనికీ లోటు ఉండదు. మరో 5 రోజుల్లో అంటే ఫిబ్రవరి 7, ఉదయం 7:11 గంటలకు బుధుడు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. మకరరాశిలో బుధగ్రహ సంచారం ఏరాశివారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
మకరరాశిలోని 10వ ఇంటిలో బుధుడు సంచరించడం వల్ల మేష రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. సమాజంలో మీకుకీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారవేత్తలకు మంచి లాభాలు ఉంటాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. మీ కెరీర్ లో అపారమైన పురోగతిని సాధిస్తారు. 
వృషభ రాశి
బుధుడి యెుక్క సంచారం ఈ రాశివారికి ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు.  మీరు ఉన్నత విద్యాసంస్థలో ఆడ్మిషన్ పొందే అవకాశం ఉంది. ఆదాయంలో రెట్టింపు ఉంటుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీ ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది. 


కర్కాటక రాశి
మీ రాశి యెుక్క 7వ ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. దీంతో న్యాయవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీడియాతో సంబంధం ఉన్నవారు లాభపడతారు. మెర్క్యూరీ యెుక్క ఈ సంచారం ఉద్యోగ, వ్యాపారులకు మంచి లాభాలను ఇస్తుంది. 
మకరరాశి
ఈ రాశి యెుక్క మొదటి ఇంట్లో బుధుడు సంచరించడం వల్ల ప్రభుత్వోద్యోగులకు సమాజంలో పేరు ప్రఖ్యాతులు మరియు గౌరవం లభిస్తాయి. మీరు అపారమైన డబ్బును సంపాదిస్తారు. బుధ సంచారం మీకు ఊహించనంత ధనాన్ని ఇస్తుంది. 


Also Read: Guru Gochar 2023: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో సూర్యుడు, బృహస్పతి కలయిక.. ఈరాశులకు ప్రతి పనిలోనూ విజయమే ఇక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook