Trigrahi Yog: ధనుస్సు రాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులకు బంపర్ బెనిఫిట్స్..
Trigrahi Yog In Dhanu: డిసెంబర్ నెలలో మూడు ప్రధాన గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం 3 రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Trigrahi Yog In Dhanu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా సంచరించడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. దీని ప్రభావం మానవ జీవితంపై ఉంటుంది. డిసెంబరులో మూడు గ్రహాల సంచారం జరగబోతుంది. డిసెంబరు 3న బుధుడు, 5న శుక్రుడు మరియు 16న సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా ధనుస్సు రాశిలో త్రిగ్రాహి యోగం (Trigrahi Yog In Dhanu) ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. దీంతో మూడు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నరు.
వృశ్చికం (Scorpio): కుండలిలో ఏర్పడిన త్రిగ్రాహి యోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో రెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ఉపాధ్యాయులు, మీడియా మరియు మార్కెటింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం బాగుంటుంది. మీ శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
కన్య (Virgo): త్రిగ్రాహి యోగం ఏర్పడటం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో నాల్గవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీరు సకల భౌతిక సుఖాలను పొందగలరు. ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారికి ఇదే మంచి సమయం. ఈ సమయంలో సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు.
మీనం (Pisces): త్రిగ్రాహి యోగం ఏర్పడటం వల్ల మీరు వృత్తి, వ్యాపారాల్లో ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే మీ రాశి నుండి దశమ స్థానంలో ఈ యోగం ఏర్పడబోతోంది. మీకు కొత్త జాబ్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు భారీగా లాభాలు ఉంటాయి. మరోవైపు సూర్య గ్రహ ప్రభావం వల్ల కుటుంబంతో సంబంధాలు బలపడి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
Also Read: Astrology: అనురాధ నక్షత్రంలో మూడు గ్రహాలు... ఈ రాశులకు ఆర్థికంగా లాభం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి