Lakshmi Narayan Yoga July 2023:  జూలై నెలలో కొన్ని గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. ఇప్పటికే కుజుడు, శుక్రుడు తమ రాశులను మార్చారు. ఇవాళ బుధుడు తన రాశిని మార్చనున్నాడు. జూలై 25న బుధుడు, శుక్రుడు కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ శుభకరమైన యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్య రాశి
కన్య రాశి వారికి లక్ష్మీ నారాయణ యోగంతో మంచి సమయం ప్రారంభమవుతుంది. మీరు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్న ఫ్యామిలీ మీకు అండగా నిలుస్తుంది. 
మిధునరాశి
లక్ష్మీనారాయణ యోగం మిథునరాశి వారికి చాలా బాగుంటుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీరు ప్రేమలో పడే అవకాశం ఉంది. ఆఫీసులో మీ బాస్ మీ పనిని తెగ మెచ్చుకుంటారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.


Also Read: Surya Grahan 2023: త్వరలో రెండవ సూర్యగ్రహణం... ఈ రాశుల వారిపై చెడు ప్రభావం..


తులారాశి
బుధుడు-శుక్రుడు కలయిక తుల రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులు మంచి ప్రయోజనాలు పొందుతారు. మీరు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. మీకు సృజనాత్మక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. మీరు ట్రావెలింగ్ చేసే అవకాశం ఉంది. 


Also Read: Guru Chandra yuti 2023: జూలై 10న మేషరాశిలో చంద్రుడు-బృహస్పతి కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook